NTV Telugu Site icon

IND vs ZIM: చేతులెత్తేసిన యువ భారత్.. జింబాబ్వేపై ఓటమి

Zim

Zim

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా భారత బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో.. 102 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిందని.. 116 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్ల ముందు యువ భారత్ చేతులెత్తేసింది.

Trinamool Congress Leader: ‘‘ముస్లిమేతరులు దురదృష్టవంతులు, ఇస్లాంని వ్యాప్తి చేయాలి’’.. తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

116 పరుగుల టార్గెట్ ను సాధించడంలో తడబడ్డారు. ఐపీఎల్ లో అదరగొట్టిన ప్లేయర్లు ఇప్పుడు బయటకు వెళ్లగానే ఢమాల్ అనేశారు. ఐపీఎల్ లో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ.. తన మొదటి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత.. రియాన్ పరాగ్ (2), ధ్రువ్ జురేల్ (6) పరుగులు చేశారు. భారత్ బ్యాటింగ్ లో.. శుభ్మాన్ గిల్ (31), రుతురాజ్ గైక్వాడ్ (7), రింకూ సింగ్ డకౌట్, వాషింగ్టన్ సుందర్ (27), రవి బిష్ణోయ్ (9), అవేశ్ ఖాన్ (16) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టెండాయ్ చతారా, సికిందర్ రజా తలో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత.. బ్రియాన్ బెన్నెట్, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెసింగ్ ముజారబానీ, ల్యూక్ జోంగ్వే తలో వికెట్ పడగొట్టారు.

Heart Attack: నిన్న పుట్టిన రోజు.. నేడు గుండెపోటుతో బాలుడు మృతి

అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే (29*) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత.. వెస్లీ మాధేవేరే (21), బ్రియాన్ బెన్నెట్ (22), డియోన్ మైయర్స్ (23), సికిందర్ రజా (17) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అత్యధికంగా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. వాషిగ్టంన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ కు తలో వికెట్ దక్కింది.