దుబాయ్‌లోని ఐసిసి అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. పాకిస్తాన్ అండర్-19 ఆసియా కప్ 2025 ను గెలుచుకుంది. 27వ ఓవర్ రెండవ బంతికి దీపేష్‌ను అలీ రజా అవుట్ చేయడంతో పాకిస్తాన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్ భారత అండర్-19 ఆసియా కప్ జట్టును 191 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసి భారత్‌కు 348 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 156 పరుగులకే కుప్పకూలిపోయింది.
భారత్ జట్టు ఛేదనలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది, కానీ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలను అలీ రజా అవుట్ చేశాడు. ఆయుష్ 2 పరుగులు చేయగా, వైభవ్ 10 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 26 పరుగులు చేశాడు. ఆరోన్ జార్జ్ (16 పరుగులు), విహాన్ మల్హోత్రా (7 పరుగులు) తో తోడుగా నిలిచారు. విహాన్ అవుట్ అయ్యే సమయానికి, భారత్ 59/4తో ఉంది. వేదాంత్ త్రివేది (9 పరుగులు) భారీ ఇన్నింగ్స్ స్కోర్ చేస్తారని భావించారు, కానీ మహ్మద్ సయ్యం వేసిన షార్ట్ బాల్‌కు వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. 27వ ఓవర్‌లో భారత్ ఆలౌట్ అయింది.
