Global Aviation Safety Ranking: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో భారత్ 48వ స్థానానికి ఎగబాకినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం భారత్ 102వ స్థానంలో ఉండేది. ర్యాంకింగ్‌లో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, యూఏఈ, దక్షిణ కొరియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని అధికారులు తెలిపారు. చైనా 49వ స్థానంలో ఉందని వారు పేర్కొన్నారు.
Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు
యూనివర్సల్ సేఫ్టీ ఓవర్‌సైట్ ఆడిట్ ప్రోగ్రామ్ (USOAP) నిరంతర పర్యవేక్షణ అప్రోచ్ కింద, నవంబర్ 9 నుండి 16 వరకు ఐసీఏవో కోఆర్డినేటెడ్ వాలిడేషన్ మిషన్ చేపట్టబడింది. శనివారం డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశ భద్రతా ర్యాంకింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి రెగ్యులేటర్ అవిశ్రాంతంగా కృషి చేసిందని అందుకే ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయన్నారు. ఈ ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు కృషిచేస్తమామన్నారు. కీలకమైన భద్రతా అంశాలను సమర్థవంతంగా అమలు చేయడంలో దేశ స్కోరు 85.49 శాతానికి మెరుగుపడిందని అధికారులు తెలిపారు.