NTV Telugu Site icon

India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..

India In World Steel Production

India In World Steel Production

India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్‌-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్‌ ప్రొడక్షన్‌ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.

ఇప్పుడు 12 కోట్ల టన్నులను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. మరో 8 ఏళ్లలో మళ్లీ రెట్టింపు స్థాయికి చేరుకోవాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. 2030 నాటికి.. ఈ 12 కోట్ల టన్నుల స్టీల్‌ ప్రొడక్షన్‌ లెవల్‌ నుంచి 30 కోట్ల టన్నులకి ఎదగాలని ఆశిస్తోంది. గత 8 ఏళ్లలో ఉక్కు ఉత్పత్తి డబుల్‌ అయింది కాబట్టే ఇండియా రెండో ర్యాంకును పొందగలిగింది. స్టీల్‌ కెపాసిటీ విషయానికొస్తే.. అప్పట్లో మన దగ్గర కేవలం ఏడున్నర కోట్ల టన్నుల ఉక్కు మాత్రమే స్టాక్‌ ఉండేది.

read also: Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‌‘ పవన్‌ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఇప్పుడు 15 పాయింట్‌ 4 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో స్టీల్‌ ప్రొడక్షన్‌కి సంబంధించి అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నందున ఈ దశాబ్దం చివరి నాటికి మన స్టాక్‌ కెపాసిటీ 15 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు ఈజీగా చేరుకోగలం. ఈ లక్ష్య ఛేదనలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. సెయిల్‌.. మరియు బొకారా స్టీల్‌ ప్లాంట్‌ కూడా భాగస్వాములు కానున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వివరించారు.