NTV Telugu Site icon

Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం

Wheat Min

Wheat Min

Wheat Price : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం వైపు ప్రపంచం దృష్టి పడింది. గోధుమలు పెద్దఎత్తున ఎగుమతి కావడంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది.

Read Also: Fake Currency: నకిలీ కరెన్సీ అడ్డాగా పాతబస్తీ.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్

గోధుమల ధర పెరగడంతో.. భారత ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నవంబర్ 2022 నుండి దేశంలో ఎగుమతి పరిమితులు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది మే 14న కేంద్రం ఎగుమతులపై భారత్ పూర్తి నిషేధం విధించింది. తరువాత రాయితీలతో ఎగుమతులు అనుమతించబడ్డాయి.

Read Also: Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్‌-టైమ్‌ ఫిక్స్‌ చెయ్, నేను రెడీ

భారతదేశ ఎగుమతులను పరిశీలిస్తే, డిసెంబర్‌లో బంగ్లాదేశ్, భూటాన్‌లకు భారతదేశం 391 టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. నవంబర్ 2022లో, భూటాన్‌కు మాత్రమే 375 టన్నుల గోధుమలు ఎగుమతి చేయబడ్డాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు అక్టోబర్‌లో 65,684 టన్నులు ఎగుమతి అయ్యాయి. భారతదేశం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో 69 దేశాలకు 4.6 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది.

Show comments