NTV Telugu Site icon

India: వియత్నాంకు స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భారత్

Rajnath Singh

Rajnath Singh

India gifts indigenously-built warship INS Kirpan to Vietnam: ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల తర్వాత వియత్నాం పీపుల్స్ నేవీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి వియత్నాంకు భారత్ స్వయంగా నిర్మించిన ఇన్-సర్వీస్ క్షిపణి కార్వెట్ ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

Also Read: Deadly lightning : మేఘాల మధ్య ప్రాణాంతకమైన మెరుపు ఎలా ఏర్పడుతుందో తెలుసా?

చర్చల సందర్భంగా, రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం ప్రతినిధులు ఇప్పటికే ఉన్న సహకార రంగాలను, ముఖ్యంగా రక్షణ పరిశ్రమ సహకారం, సముద్ర భద్రత, బహుళజాతి సహకారం రంగాలలో దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను గుర్తించారు. ఈ రోజు ఢిల్లీలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌తో జరిగిన ఫలవంతమైన సమావేశంలో భారత్-వియత్నాం రక్షణ సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించారని ఈ సమావేశం గురించి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

Also Read: PM Modi: ఈజిప్టుకు ప్రధాని మోదీ.. ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు పర్యటన

జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ భారతదేశ పరిశోధన, అభివృద్ధి ఏజెన్సీ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు, రక్షణ, పరిశోధన, ఉమ్మడి ఉత్పత్తిలో సహకారం ద్వారా రక్షణ పారిశ్రామిక సామర్థ్యాలను పెంపొందించే మార్గాలను చర్చించారు. అంతకుముందు జాతీయ యుద్ధ స్మారకం వద్ద జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. వియత్నాం రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటనలో (జూన్ 18 మరియు 19) భారతదేశంలో ఉన్నారు. వ్యూహాత్మకంగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన పొరుగు ప్రాంతాలపై దృష్టి సారించి ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన ఈస్ట్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో వియత్నాం భారతదేశానికి ముఖ్యమైన మిత్రదేశం వియత్నాం.