NTV Telugu Site icon

Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి

Rupee Vs Dollar

Rupee Vs Dollar

Forex : అంతర్జాతీయంగా చాలా దేశాల్లో మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశాల ఆర్థిక ఆటుపోట్ల ప్రభావం భారత పరపతి రేటింగ్‌పై పెద్దగా ఉండదని అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌ రేటింగ్స్‌’ తెలిపింది. ఒకవేళ ఆటుపోట్ల ప్రభావం భారత్‌పై పడినా అది పరిమిత స్థాయిలో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. సమృద్ధిగా ఉన్న విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలే ఈ విషయంలో భారత్‌కు పెద్ద భరోసా అని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి ఉన్న 53,300 కోట్ల డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు 8.9 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా వేసింది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది.

Read Also: Shamshabad Airport: అనుమానితుడి కలకలం.. అరెస్ట్ చేసిన పోలీసులు

భారత్ లోకి వచ్చి పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.4శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో పోల్చితే(1.2శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

2013తో పోలిస్తే బెటర్‌ అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ 2013లో వరుస పెట్టి వడ్డీ రేట్లు పెంచినప్పటితో పోల్చినా భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఫిచ్‌ తెలిపింది. అప్పట్లో ఆరున్నర నెలల దిగుమతులకు మాత్రమే సరిపోయే ఫారెక్స్‌ నిల్వలు ఉంటే ఇప్పుడు 8.9 నెలల దిగుమతులకు సరిపోయే ఫారెక్స్‌ నిల్వలు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఏడాదిలోపు చెల్లించాల్సిన స్వల్పకాలిక రుణాల చెల్లింపులకు, ప్రస్తుత ఫారెక్స్‌ నిల్వల్లో భారత్‌ 24 శాతం ఖర్చు చేస్తే సరిపోతుందని అంచనా వేసింది.

Read Also: Power Bill: కరెంట్‌ బిల్లు చూస్తేనే షాక్‌.. వందల్లో వచ్చే బిల్లు.. వేలు దాటింది..!

విదేశీ రుణ భారం తక్కువే చాలా దేశాలతో పోలిస్తే భారత విదేశీ రుణ భారం ఇప్పటికీ తక్కువని ఫిచ్‌ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి జీడీపీలో విదేశీ రుణ భారం 18.6 శాతం మాత్రమేనని తెలిపింది. ఇదే సమయంలో భారత్‌లా ‘బీబీబీ’ పరపతి రేటింగ్‌ ఉన్న మిగతా దేశాల సగటు విదేశీ రుణ భారం ఆయా దేశాల జీడీపీలో 72 శాతం వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. మొత్తం విదేశీ రుణాల్లో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల వాటా 4 శాతం ఉంటే, దేశీయ ప్రభుత్వ హామీ ఉండే రుణాల మార్కెట్లోనూ ఎఫ్‌పీఐల వాటా రెండు శాతంలోపేనని ఫిచ్‌ పేర్కొంది.