India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s First Indigenous Bullet Train: దేశంలోనే తొలిసారిగా భారత్ సొంత సాంకేతికతతో, స్వదేశీ డిజైన్‌తో రూపొందిస్తున్న బుల్లెట్ రైలు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు మన దేశపు హైస్పీడ్ రైల్వే ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులోని బీఈఎమ్ఎల్ (BEML) తయారీ కేంద్రాన్ని సందర్శించి, ప్రస్తుతం నిర్మాణం, స్ట్రక్చరల్ టెస్టింగ్‌లో ఉన్న ఈ రైలుకు సంబంధించిన విషయాలను పరిశీలించారు. “భారత్ తొలి బుల్లెట్ రైలు రూపకల్పన సాగుతోంది” అంటూ ఈ రైలు విశేషాలకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆయన ఎక్స్ (X) వేదికగా పంచుకోవడంతో రైల్వే వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కోసం ఈ రైలును ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. మన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభను, ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందిస్తున్న ఈ బుల్లెట్ రైలును ప్రయాణికుల సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయోగాత్మక పరీక్షలు జరుపుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటుంది.0 కాగా ప్రయాణికులతో వెళ్లేటప్పుడు గంటకు 249 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్‌తో నడుస్తుంది. సుమారు 202 మీటర్ల పొడవు ఉండే ఈ రైలులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 4 మోటార్ కార్లు, 4 ట్రైలర్ కార్లు ఉంటాయి. ఇందులో ఒకేసారి దాదాపు 557 మంది ప్రయాణించవచ్చు. దివ్యాంగుల (PRM) కోసం ప్రత్యేకంగా రెండు సీట్లను కేటాయించారు. సాధారణ ప్రయాణికుల కోసం 3×2 సీటింగ్ అమరికతో 7 స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లను, 2×2 సీటింగ్‌తో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ను డిజైన్ చేశారు. రైలుకు రెండు వైపులా డ్రైవర్ క్యాబిన్లు ఉంటాయి. డ్రైవర్ సులభంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌తో నిరంతరం సమన్వయం చేసుకోవడానికి అధునాతన ‘ఇంటెలిజెంట్ ఆన్-బోర్డ్ కంట్రోల్ సిస్టమ్’ ఇందులో అమర్చారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే, భవిష్యత్తులో రెండు 8-కోచ్‌ల రైళ్లను ఒకేసారి జోడించి 16-కోచ్‌ల విశాలమైన రైలుగా నడిపే వెసులుబాటు కూడా ఉండటం విశేషం.
Also Read
- జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
- Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
- YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
- Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
మన భారతీయుల అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. కాళ్లు ప్రశాంతంగా చాపుకోవడానికి తగినంత లెగ్‌రూమ్, పెద్ద పెద్ద కిటికీలు, కళ్లకు ఆహ్లాదాన్నిచ్చే ఎల్ఈడీ లైటింగ్, లగేజీ పెట్టుకోవడానికి అనుకూలమైన ఓవర్‌హెడ్ రాక్స్ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రతి సీటు వద్ద పవర్ సాకెట్లు ఉంటాయి. భారీ లగేజీ బ్యాగుల కోసం ఫ్లోర్‌పై ప్రత్యేక స్టాండ్లు, శుభ్రత కోసం ఆధునిక బయో-డిజెస్టర్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కోచ్‌ల మధ్య ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేలా ఒకే ముక్కగా సీల్ చేసిన గ్యాంగ్వే ఉంటుంది. ప్రయాణంలో వినోదం, సమాచారం కోసం క్యాబిన్లలో ఎల్సీడీ స్క్రీన్లను అమర్చారు. వీటి ద్వారా ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సమాచారం లభిస్తుంది. ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఆడియో ప్రకటనలు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడటానికి ‘ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్లు’ ఉన్నాయి. ప్రయాణికులు తమ ఫోన్లలో కంటెంట్ చూసుకోవడానికి అనువుగా వైఫై ఆధారిత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
అందరికీ అనుకూలంగా ఉండేలా ప్రవేశ మార్గాలను తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫామ్ ఎత్తులోనే రైలు ఫ్లోర్ ఉండేలా డిజైన్ చేయడమే కాకుండా, తలుపుల్లో అమర్చిన రెట్రాక్టబుల్ స్టెప్స్ వల్ల రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉండే ఖాళీ తగ్గి ప్రయాణికులు సులభంగా లోపలికి ఎక్కవచ్చు. వీల్‌ఛైర్లతో వచ్చే ప్రయాణికుల కోసం అనుకూలమైన తలుపులు, ప్రత్యేక సీట్లు, ప్రత్యేక టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపి సైన్ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ఏ వాతావరణంలోనైనా రైలులో సరైన ఉష్ణోగ్రత, తేమ ఉండేలా చూసేందుకు ప్రతి కోచ్‌లో రెండు హెచ్విఏసి (HVAC) ఏసీ యూనిట్లు పనిచేస్తాయి. ఇక, రైలు వేగంతో వెళ్లేటప్పుడు వచ్చే గాలి నిరోధకత, శబ్దం, పీడన మార్పులను (ముఖ్యంగా టన్నెల్స్ దాటేటప్పుడు) సమర్థవంతంగా తట్టుకోవడానికి ‘కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్’ (CFD) సిమ్యులేషన్స్ ద్వారా రైలు ముందు భాగం (నోజ్), బాడీ రూపుదిద్దుకున్నాయి. ఈ శోధనల ఆధారంగా రూపొందించిన ఏరోడైనమిక్ డిజైన్ వల్ల రైలు వేగానికి గాలి అడ్డంకి కాకపోవడమే కాక, టన్నెల్స్‌లో ప్రవేశించినప్పుడు వచ్చే భారీ శబ్దాలు (సోనిక్ బూమ్స్) తగ్గుతాయి. రైలు పైకప్పు, ఎయిర్ డిఫ్లెక్టర్లు, ఏసీ యూనిట్లు గాలి ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా బాడీలో కలిసిపోయేలా అమర్చారు. రైలులోని ప్రయాణికులకు శబ్దాల హోరు తెలియకుండా ఉండేందుకు ఫ్లోర్, బాడీలో సౌండ్ ఇన్సులేషన్ మెటీరియల్స్, చక్రాల వద్ద ప్రత్యేక కోటింగ్ వాడారు. ఈ రైలు 25 కెవి, 50 హెర్ట్జ్ సింగిల్-ఫేజ్ ఏసీ ట్రాక్షన్ సిస్టమ్‌పై, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల ద్వారా పనిచేస్తుంది. ఇందులో ‘రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్’ వాడటం వల్ల, రైలు స్లో అయిన ప్రతిసారీ కొంత విద్యుత్ శక్తి తిరిగి ఉత్పత్తి అయి పవర్ సిస్టమ్‌లోకి చేరుతుంది. ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, పర్యావరణహితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ఈ భారత్ తొలి బుల్లెట్ రైలు అత్యంత ఆధునిక ప్రమాణాలతో సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి