హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ తేరుకుంది. కొద్ది రోజులుగా గ్రీన్లాండ్ వివాదం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తల కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఈ వారం ప్రారంభం నుంచి కూడా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అయితే తాజాగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ ప్రకటన మార్కెట్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది. భారతదేశంతో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటున్నట్లు ప్రకటించడంతో మార్కెట్ మంచి జోష్ నడుస్తోంది. గురువారం మార్కెట్ ప్రారంభం నుంచే భారీ లాభాలతో దూసుకెళ్తోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 755 పాయింట్లు లాభపడి 82,683 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీతో 241 పాయింట్లు లాభపడి 25,398 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఎటర్నల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఆసియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, మాక్స్ హెల్త్‌కేర్, ఎన్టిపిసి నష్టపోయాయి.