Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

Election Results 2026

Election Results 2026

Election Results 2026: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది.. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం రాష్ట్రాలతో పాటు యూటీ అయిన పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.. అయితే, బెంగాల్‌ బాద్‌షా ఎవరు?.. తమిళనాడులో కింగ్‌ ఎవరు?.. కేరళం సీఎం ఎవరు..? అసోం పీఠాన్ని అధిరోహించేది ఎవరు? పుదుచ్చేరిలో గెలుపు ఎవరది అనేది ఉత్కంఠగా మారిపోయింది..

The liveblog has ended.
  • 04 May 2026 06:47 PM (IST)

    బెంగాల్‌లో కమలం వికసించింది -మోడీ

    బెంగాల్‌లో కమలం వికసించింది. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఇది బెంగాల్‌ ప్రజల విజయం. బీజేపీని గెలిపించిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు. -ప్రధాని మోడీ

  • 04 May 2026 05:30 PM (IST)

    మాజీ సీఎం పళనిస్వామి విజయం

    తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం. ఎడప్పాడిలో 90 వేలకు పైగా ఓట్లతో పళనిస్వామి గెలుపు.

  • 04 May 2026 05:06 PM (IST)

    రెండు స్థానాల్లో గెలిచిన టీవీకే అధినేత విజయ్‌

    పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచిన టీవీకే అధినేత విజయ్‌. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌లో భారీ మెజారిటీతో విజయ్‌ విక్టరీ.

  • 04 May 2026 04:51 PM (IST)

    కేరళం ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌ ట్వీట్‌

    కేరళం ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌ ట్వీట్‌. ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు అభినందనలు. UDF మద్దతుదారులకు, కేరళం ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజానీకం తరుపున ఎల్లప్పుడు మీకు కృతజ్ఞుడనై ఉంటాను. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన భవిష్యత్‌ వైపు సాగుతున్నాం. -సీఎం రేవంత్‌ రెడ్డి

  • 04 May 2026 04:49 PM (IST)

    బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు. -కిషన్‌ రెడ్డి

    గత పదేళ్లలో బెంగాల్‌లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌గా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయం. టీఎంసీ అరాచకాలు, గుండాగిరి, వ్యవస్థలను నాశనం చేయడంపై జనం విసిగిపోయారు. దీదీ సర్కారు ఇల్లీగల్‌ కోల్ మైనింగ్‌ చేసి వేలాది కోట్లు వెనకేసుకుంది. కోల్ బెల్ట్‌తో బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు. -కిషన్‌ రెడ్డి

  • 04 May 2026 04:36 PM (IST)

    తమిళనాడులో సూపర్‌ హిట్టయిన విజయ్‌ టీవీకే పార్టీ

    తమిళనాడులో సూపర్‌ హిట్టయిన విజయ్‌ టీవీకే పార్టీ. కోటి 28 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచిన టీవీకే. రెండో స్థానానికి పరిమితమైన అధికార డీఎంకే కూటమి. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు కోటి 17 లక్షలు. ఒంటరిగా 83 లక్షల ఓట్లు సాధించి డీఎంకే. మూడో స్థానంతో సరిపెట్టుకున్న అన్నాడీఎంకే కూటమి. అన్నాడీఎంకే ఓట్లు కోటి 8 లక్షలు. అన్నాడీఎంకేకు ఒంటిరిగా 77 లక్షల ఓట్లు.

  • 04 May 2026 04:06 PM (IST)

    ఎన్నికల ఫలితాలపై జగన్‌ ఆసక్తికర పోస్ట్‌

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జగన్‌ ఆసక్తికర పోస్ట్‌. సోదరుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం చాలా గొప్ప విషయం. ప్రజాసేవలో మీరు మొదలుపెడుతున్న ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలి. దీదీ మమతా బెనర్జీకి నా సానుభూతి. బీజేపీ, ఇతర విజేతలకు నా అభినందనలు. -వైఎస్‌ జగన్‌

  • 04 May 2026 04:03 PM (IST)

    సీఎం స్టాలిన్‌ ఓటమి

    TN: కొళత్తూరులో తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి. కొళత్తూరులో టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు గెలుపు. చేపాక్‌లో 4,319 ఓట్ల ఆధిక్యంలో ఉదయనిధి స్టాలిన్‌.
  • 04 May 2026 03:53 PM (IST)

    టీవీకే పూర్తిస్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యం

    TN: టీవీకే పూర్తిస్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యం. తమిళనాడులో హంగ్‌కే అవకాశం. టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీతో 11 సీట్లు, 2 వేల లోపు మెజార్టీతో 12 సీట్లు, 500 లోపు మెజార్టీతో 8 స్థానాలు. టీవీకే అభ్యర్థులకు స్వల్ప మెజార్టీలు. తమిళనాడు మ్యాజిక్‌ ఫిగర్‌ 118. మ్యాజిక్‌ ఫిగర్‌ను టీవీకే చేరుకోవడం కష్టమే.! టీవీకేకి స్థానాలు 90-95 మధ్య వస్తే.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో కలిసి వెళ్లినా ప్రభుత్వ ఏర్పాటు కష్టమే. AIDMK లేదా DMKని కలుపుకుని వెళ్తేనే TVKకు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం.

  • 04 May 2026 03:35 PM (IST)

    ఓడిన గౌరవ్‌ గొగోయ్‌

    అసోం: 23 వేల ఓట్లతో ఓడిన గౌరవ్‌ గొగోయ్‌ (కాంగ్రెస్‌).

  • 04 May 2026 03:08 PM (IST)

    ఇది చారిత్రాత్మక విజయం. -విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌

    టీవీకె గెలుపు చాలా గర్వంగా ఉంది. విజయ్ సీఎం అవుతానని చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒక్క శాతం కూడా విజయ్‌కి డౌట్‌లేదు. పొత్తులకు వెళ్లకుండా సింగిల్‌గా పోటీ చేశాడు. ఇది చారిత్రాత్మక విజయం. -విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌

  • 04 May 2026 02:58 PM (IST)

    తమిళిసై వెనుకంజ

    TN: మైలాపూర్‌లో 27వేల ఓట్లతో మాజీ గవర్నర్‌ తమిళిసై వెనుకంజ.
  • 04 May 2026 02:53 PM (IST)

    కాంగ్రెస్‌ మద్దతు కోరిన విజయ్‌తండ్రి

    ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ మద్దతు కోరిన విజయ్‌తండ్రి. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. -విజయతండ్రి చంద్రశేఖర్‌

  • 04 May 2026 01:47 PM (IST)

    విజయ్‌ ఇంటికి నటి త్రిష

    టీవీకే అధినేత విజయ్‌ ఇంటికి వెళ్లారు నటి త్రిష.. ఉదయం తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు  చేసిన ఆమె.. తిరుమల నుంచి నేరుగా చెన్నై వెళ్లారు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ప్రభంజనం సృష్టించగా.. విజయ్‌కి అభినందనలు తెలిపారు త్రిష.. ఇక, ఇవాళ త్రిష బర్త్‌ డే కావడం మరో విశేషం

  • 04 May 2026 12:11 PM (IST)

    బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోడీ..

    ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు ప్రధాని మోడీ.. సాయంత్రం 6 గంటలకు పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ

  • 04 May 2026 12:08 PM (IST)

    దూసుకెళ్తున్న విజయ్ పార్టీ

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది.. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఇప్పటి వరకు 110 స్థానాల్లో టీవీకే, 70 స్థానాల్లో అన్నా డీఎంకే కూటమి, 54 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నాయి..

  • 04 May 2026 11:31 AM (IST)

    నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఆధిక్యం..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అందరి కళ్లున్న నందిగ్రామ్ (Nandigram) నియోజకవర్గంలో ఉత్కంఠ రౌండ్ రౌండ్‌కు పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, మూడవ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన తన సమీప ప్రత్యర్థిపై 7,000 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్‌లో ప్రతి రౌండ్ ముగిసే కొద్దీ సువేందు అధికారి తన పట్టును పటిష్టం చేసుకుంటున్నారు. 2021లో కూడా ఇక్కడ మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించగా, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తుండటం గమనార్హం.

  • 04 May 2026 10:26 AM (IST)

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే పైచేయి..

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, బెంగాల్ పీఠం కోసం జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో బీజేపీ అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు అతి సమీపంలో 138 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ కూటమి (TMC+) 123 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒకానొక దశలో ఇరు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి బీజేపీ స్పష్టమైన పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. మరోవైపు, బెంగాల్‌ను దశాబ్దాల పాటు పాలించిన వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఈసారి కూడా ప్రభావం చూపలేక చతికిలపడ్డాయి. కాంగ్రెస్ 2 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉండగా, ఇతరులు 3 చోట్ల ముందంజలో ఉన్నారు.

  • 04 May 2026 10:16 AM (IST)

    కమలం కంచుకోట గిరిజన ప్రాంతం "జంగల్‌మహల్"

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటగా ఉండి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త పట్టు కోల్పోయిన గిరిజన ప్రాంతం జంగల్‌మహల్ (Jangalmahal), ఇప్పుడు మళ్ళీ కమలం గూటికి చేరుతున్నట్లు కనిపిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, ఈ ప్రాంతంలోని 9 నియోజకవర్గాలకు గానూ.. పశ్చిమ మేదినీపూర్ మినహా మిగిలిన 7 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా జంగల్‌మహల్ జిల్లాలైన బంకురా (Bankura), ఝార్గ్రామ్ (Jhargram) లో బీజేపీ జైత్రయాత్ర సాగుతోంది. గిరిజన ఓటర్లు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపడం వల్లనే ఈ స్థాయిలో ఆధిక్యం లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో తిరిగి పుంజుకోవడం బీజేపీకి రాష్ట్రవ్యాప్త ఫలితాల్లో పెద్ద బూస్ట్‌గా మారనుంది. నేటి మధ్యాహ్నం కల్లా ఈ ఆధిక్యం ఏ మేరకు గెలుపుగా మారుతుందో స్పష్టం కానుంది.

  • 04 May 2026 10:03 AM (IST)

    టెంట్లు పీకేస్తున్న డీఎంకే .. బోసిపోయిన పార్టీ కార్యాలయం..

    మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు ముందు చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కార్యకర్తలు మంచి జోష్‌లో కనిపించారు. అయితే, ఫలితాలు వెలువడుతున్న రెండు గంటల్లోపే పరిస్థితులు తారుమారయ్యాయి. డీఎంకే ఆఫీస్ నుంచి కార్యకర్తలు వెళ్లిపోవడం కనిపించింది. టెంట్లు పీకేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

  • 04 May 2026 10:00 AM (IST)

    సెంచరీ మార్కును దాటిన విజయ్ పార్టీ..

    తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు గానూ విజయ్ టీవీకే పార్టీ 100 పైగా స్థానాాల్లో లీడింగ్‌లో ఉంది. అన్నాడీఎంకే 70 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అధికార పార్టీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. కేవలం 50 స్థానాల్లో ముందంజలో ఉంది. సీఎం స్టాలిన్ సహా, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లు వరసగా కొలత్తూర్, చెపాక్ నుంచి వెనుకంజలో ఉన్నారు. డీఎంకేలో మరో కీలక నేత , మంత్రి సెంథిల్ బాలాజీ కూడా వెనుకంజలో ఉన్నారు.

  • 04 May 2026 09:46 AM (IST)

    ఫలితాల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేళ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తీరును స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నడూ చూడలేదని, ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. పాతకాలపు ఎన్నికల సంస్కృతి నుంచి బెంగాల్ బయటపడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. "అభివృద్ధే కొత్త రాజకీయ నినాదం" అని స్పష్టం చేసిన ఆయన, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలే తమ ఓటింగ్ సరళిని మార్చుకోగలిగినప్పుడు, బెంగాల్ ఎందుకు మార్చుకోలేదు? అని ప్రశ్నించారు. బెంగాలీలు మార్పును కోరుకుంటున్నారని, అది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 04 May 2026 09:39 AM (IST)

    వెనుకంజలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్..

    అస్సాం జోర్హాట్ సీటులో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ వెనుకంజలో ఉన్నారు. అస్సాం ఎన్నికల ఫలితాలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

  • 04 May 2026 09:28 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్స్‌లో టీవీకే ముందంజ..

    తమిళనాడు పోస్టల్‌ బ్యాలెట్‌లో మొదటి స్థానానికి దూసుకొచ్చింది టీవీకే.. రెండో స్థానంలో డీఎంకే.. పోస్టల్‌ బ్యాలెట్‌లో మూడో స్థానానికి పరిమితమయ్యా అన్నాడీఎంకే

  • 04 May 2026 09:24 AM (IST)

    కేరళలో 5 స్థానాల్లో బీజేపీ లీడింగ్..

    కేరళలో ప్రస్తుత ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేమం నుంచి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు.

  • 04 May 2026 09:22 AM (IST)

    అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

    అస్సాంలో బీజేపీ మెజారిటీ మార్కును అధిగమించింది. బీజేపీ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 126 స్థానాలు ఉంటే, మ్యాజిక్ ఫిగర్ 64

  • 04 May 2026 09:12 AM (IST)

    చెపాక్‌లో వెనుకంజలో ఉదయనిధి స్టాలిన్..

    డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో ఏడీఎంకే అభ్యర్థి ఆదిరాజారామ్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

  • 04 May 2026 09:10 AM (IST)

    సీఎం, డిప్యూటీ సీఎం వెనుకంజ..

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం, డిప్యూటీ సీఎం వెనుకంజలో ఉన్నారు.. తండ్రీ కొడుకులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌ వెనుకబడ్డారు..

  • 04 May 2026 09:09 AM (IST)

    సీఎం స్టాలిన్ వెనుకంజ..

    తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి వీ ఎస్ బాబు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

  • 04 May 2026 09:04 AM (IST)

    జనతా వర్సెస్‌ మమతా..

    ఇవి జనతా వర్సెస్‌ మమతా పోటీ ఎన్నికలు అని అభివర్ణించింది భారతీయ జనతా పార్టీ.. మమతా బెనర్జీపై జనం కోసం విస్పష్టంగా పేర్కొంది బీజేపీ

  • 04 May 2026 08:52 AM (IST)

    బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్‌ ఫైట్

    బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్‌ ఫైట్ నడుస్తోంది.. భవానీపూర్‌, నందిగ్రాంలో బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భవానీపూర్‌లో మతా బెనర్జీ వెనుకంజో ఉన్నారు..

  • 04 May 2026 08:50 AM (IST)

    టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు..

    తొలి ట్రెండ్‌లలో బెంగాల్‌లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇది ఫలితాలు ఎలా ఉండవచ్చో సూచిస్తోంది. బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 04 May 2026 08:49 AM (IST)

    సీఎం స్టాలిన్ వెనుకంజ..

    తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి వీ ఎస్ బాబు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

  • 04 May 2026 08:17 AM (IST)

    దూసుకుపోతున్న డీఎంకే.

    ఎర్లీ ట్రెండ్స్‌లో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకుపోతంది. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 04 May 2026 08:11 AM (IST)

    డీఎంకేకు పోటీ ఇస్తున్న టీవీకే.. అస్సాంలో బీజేపీ.. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం

    తొలి ట్రెండ్ వెలువడింది. తమిళనాడులో టీవీకే అధినేత తలపతి విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం, అస్సాంలో దూసుకుపోతున్న బీజేపీ.

  • 04 May 2026 08:06 AM (IST)

    ఓట్ల లెక్కింపు ప్రారంభం

    నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది.. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు అధికారులు

  • 04 May 2026 08:04 AM (IST)

    మొదలైన ఓట్ల లెక్కింపు..

    ఓట్ల లెక్కింపు ప్రారంభం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు.

  • 04 May 2026 07:59 AM (IST)

    ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు.. మేజిక్‌ ఫిగర్‌ ఎంత..?

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉంటే.. మేజిక్‌ ఫిగర్‌ 148 సీట్లుగా ఉంది.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా.. మేజిక్‌ ఫిగర్‌ 118 సీట్లుగా ఉన్నాయి.. ఇక, కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా.. మేజిక్‌ ఫిగర్‌ 71 సీట్లుగా ఉంది.. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లకు గాను మేజిక్‌ ఫిగర్‌ 64 సీట్లుగా ఉంటుంది.. మరోవైపు పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉంటే.. మేజిక్‌ ఫిగర్‌ 16 సీట్లుగా ఉంది..

  • 04 May 2026 07:54 AM (IST)

    అసోంలో ఎన్డీఏ హ్యాట్రిక్‌..?

    అసోంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 126.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మ్యాజిక్ ఫిగర్” 64.. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన 85.38 ఓటింగ్ శాతం.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో “ఎన్డీఏ” కూటమి గెలిస్తే మూడవ సారి ప్రభుత్వం ఏర్పాటు. కూటమి విజయం సాధిస్తే రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హిమంత్ బిశ్వ శర్మ