Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
Election Results 2026: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం రాష్ట్రాలతో పాటు యూటీ అయిన పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.. అయితే, బెంగాల్ బాద్‌షా ఎవరు?.. తమిళనాడులో కింగ్ ఎవరు?.. కేరళం సీఎం ఎవరు..? అసోం పీఠాన్ని అధిరోహించేది ఎవరు? పుదుచ్చేరిలో గెలుపు ఎవరది అనేది ఉత్కంఠగా మారిపోయింది..
Also Read
-
04 May 2026 10:03 AM (IST)
టెంట్లు పీకేస్తున్న డీఎంకే .. బోసిపోయిన పార్టీ కార్యాలయం..
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు ముందు చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కార్యకర్తలు మంచి జోష్‌లో కనిపించారు. అయితే, ఫలితాలు వెలువడుతున్న రెండు గంటల్లోపే పరిస్థితులు తారుమారయ్యాయి. డీఎంకే ఆఫీస్ నుంచి కార్యకర్తలు వెళ్లిపోవడం కనిపించింది. టెంట్లు పీకేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
-
04 May 2026 10:00 AM (IST)
సెంచరీ మార్కును దాటిన విజయ్ పార్టీ..
తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు గానూ విజయ్ టీవీకే పార్టీ 100 పైగా స్థానాాల్లో లీడింగ్‌లో ఉంది. అన్నాడీఎంకే 70 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అధికార పార్టీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. కేవలం 50 స్థానాల్లో ముందంజలో ఉంది. సీఎం స్టాలిన్ సహా, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లు వరసగా కొలత్తూర్, చెపాక్ నుంచి వెనుకంజలో ఉన్నారు. డీఎంకేలో మరో కీలక నేత , మంత్రి సెంథిల్ బాలాజీ కూడా వెనుకంజలో ఉన్నారు.
-
04 May 2026 09:46 AM (IST)
ఫలితాల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేళ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తీరును స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నడూ చూడలేదని, ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. పాతకాలపు ఎన్నికల సంస్కృతి నుంచి బెంగాల్ బయటపడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. "అభివృద్ధే కొత్త రాజకీయ నినాదం" అని స్పష్టం చేసిన ఆయన, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలే తమ ఓటింగ్ సరళిని మార్చుకోగలిగినప్పుడు, బెంగాల్ ఎందుకు మార్చుకోలేదు? అని ప్రశ్నించారు. బెంగాలీలు మార్పును కోరుకుంటున్నారని, అది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
04 May 2026 09:39 AM (IST)
వెనుకంజలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్..
అస్సాం జోర్హాట్ సీటులో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ వెనుకంజలో ఉన్నారు. అస్సాం ఎన్నికల ఫలితాలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
-
04 May 2026 09:28 AM (IST)
పోస్టల్ బ్యాలెట్స్‌లో టీవీకే ముందంజ..
తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో మొదటి స్థానానికి దూసుకొచ్చింది టీవీకే.. రెండో స్థానంలో డీఎంకే.. పోస్టల్ బ్యాలెట్‌లో మూడో స్థానానికి పరిమితమయ్యా అన్నాడీఎంకే
-
04 May 2026 09:24 AM (IST)
కేరళలో 5 స్థానాల్లో బీజేపీ లీడింగ్..
కేరళలో ప్రస్తుత ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేమం నుంచి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు.
-
04 May 2026 09:22 AM (IST)
అస్సాంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
అస్సాంలో బీజేపీ మెజారిటీ మార్కును అధిగమించింది. బీజేపీ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 126 స్థానాలు ఉంటే, మ్యాజిక్ ఫిగర్ 64
-
04 May 2026 09:12 AM (IST)
చెపాక్‌లో వెనుకంజలో ఉదయనిధి స్టాలిన్..
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో ఏడీఎంకే అభ్యర్థి ఆదిరాజారామ్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
-
04 May 2026 09:10 AM (IST)
సీఎం, డిప్యూటీ సీఎం వెనుకంజ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం, డిప్యూటీ సీఎం వెనుకంజలో ఉన్నారు.. తండ్రీ కొడుకులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వెనుకబడ్డారు..
-
04 May 2026 09:09 AM (IST)
సీఎం స్టాలిన్ వెనుకంజ..
తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి వీ ఎస్ బాబు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
-
04 May 2026 09:04 AM (IST)
జనతా వర్సెస్ మమతా..
ఇవి జనతా వర్సెస్ మమతా పోటీ ఎన్నికలు అని అభివర్ణించింది భారతీయ జనతా పార్టీ.. మమతా బెనర్జీపై జనం కోసం విస్పష్టంగా పేర్కొంది బీజేపీ
-
04 May 2026 08:52 AM (IST)
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.. భవానీపూర్, నందిగ్రాంలో బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భవానీపూర్‌లో మతా బెనర్జీ వెనుకంజో ఉన్నారు..
-
04 May 2026 08:50 AM (IST)
టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు..
తొలి ట్రెండ్‌లలో బెంగాల్‌లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇది ఫలితాలు ఎలా ఉండవచ్చో సూచిస్తోంది. బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-
04 May 2026 08:49 AM (IST)
సీఎం స్టాలిన్ వెనుకంజ..
తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి వీ ఎస్ బాబు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
-
04 May 2026 08:17 AM (IST)
దూసుకుపోతున్న డీఎంకే.
ఎర్లీ ట్రెండ్స్‌లో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకుపోతంది. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
-
04 May 2026 08:11 AM (IST)
డీఎంకేకు పోటీ ఇస్తున్న టీవీకే.. అస్సాంలో బీజేపీ.. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం
తొలి ట్రెండ్ వెలువడింది. తమిళనాడులో టీవీకే అధినేత తలపతి విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం, అస్సాంలో దూసుకుపోతున్న బీజేపీ.
-
04 May 2026 08:06 AM (IST)
ఓట్ల లెక్కింపు ప్రారంభం
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది.. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు అధికారులు
-
04 May 2026 08:04 AM (IST)
మొదలైన ఓట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపు ప్రారంభం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు.
-
04 May 2026 07:59 AM (IST)
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు.. మేజిక్ ఫిగర్ ఎంత..?
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉంటే.. మేజిక్ ఫిగర్ 148 సీట్లుగా ఉంది.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 118 సీట్లుగా ఉన్నాయి.. ఇక, కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 71 సీట్లుగా ఉంది.. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లకు గాను మేజిక్ ఫిగర్ 64 సీట్లుగా ఉంటుంది.. మరోవైపు పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉంటే.. మేజిక్ ఫిగర్ 16 సీట్లుగా ఉంది..
-
04 May 2026 07:54 AM (IST)
అసోంలో ఎన్డీఏ హ్యాట్రిక్..?
అసోంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 126.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మ్యాజిక్ ఫిగర్” 64.. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన 85.38 ఓటింగ్ శాతం.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో “ఎన్డీఏ” కూటమి గెలిస్తే మూడవ సారి ప్రభుత్వం ఏర్పాటు. కూటమి విజయం సాధిస్తే రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హిమంత్ బిశ్వ శర్మ
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!