Site icon NTV Telugu

PSL 2025: మ్యాచ్‌కి కొన్ని గంటల ముందే భారత్ దాడి.. బయపడిపోయిన పీసీబీ! ఇంగ్లండ్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటో

Rawalpindi Stadium Drone Attack

Rawalpindi Stadium Drone Attack

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను విజయవంతంగా చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టింది. గురువారం కూడా దాడులు కొనసాగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది. స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై డ్రోన్ పడగా.. పలువురు గాయపడ్డారు. ఈ డ్రోన్ ఐపీఎల్ 2025 మ్యాచ్‌కు ముందు కుప్పకూలడంతో పీసీబీ బయపడిపోయింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025 మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ కూలింది. ఈ డ్రోన్ ప్రమాదం పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి కొన్ని గంటల ముందే చోటు చేసుకుంది. భారత్ దాడితో పీసీబీ వణికిపోయింది. పీఎస్‌ఎల్ 2025 మ్యాచ్‌లను ఉన్నపళంగా కరాచీకి మార్చింది. ఈరోజు రాత్రి 8 గంటలకు రావల్పిండిలో పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భద్రతా పరిస్థితులపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.

Also Read: IPL 2025: దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి.. జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు!

పీఎస్ఎల్‌ 2025లో ఇంగ్లండ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ 2025లోనే కొనసాగాలా? లేదా వెంటనే పాకిస్తాన్ వీడాలా అన్నది కొద్దిసేపట్లో తేలనుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆటగాళ్ల విషయంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు బయపడిపోయినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్‌ 2025 వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Exit mobile version