India Hypersonic Missile: భారత్ అమ్ముల పొదిలోని ఆయుధాలను చూస్తే పాకిస్థాన్ గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. ఇప్పటికే ఇండియా వద్ద బ్రహ్మోస్ వంటి ప్రమాదకరమైన క్షిపణులు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ధ్వని క్షిపణి కూడా చేరింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) “ధ్వని” అనే కొత్త తరం క్షిపణిని పరీక్షించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్షిపణి గంటకు దాదాపు 7,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్షిపణి ఎక్కువ దూరం ప్రయాణించే పరిధిని కలిగి ఉంటాయని, ఇండో – రష్యన్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి కంటే వేగంగా ప్రయాణిస్తుందని చెబుతున్నారు. ఈ క్షిపణి మొదటి పరీక్ష 2025 చివరి నాటికి జరగవచ్చని అంటున్నారు. దీని రాకతో భారత్ శక్తి మరింత బలోపేతం అవుతుందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
READ ALSO: Pawan Kalyan: సీజేఐపై దాడికి యత్నం.. పవన్ కల్యాణ్ కీలక ట్వీట్..
ధ్వని క్షిపణి ప్రత్యేకతలు తెలుసా..
ధ్వని అనేది DRDO హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్టేటర్ వెహికల్ (HSTDV) ప్రోగ్రామ్ ఆధారంగా రూపొందించారు. 2020లో HSTDV స్క్రామ్‌జెట్ ఇంజిన్ విజయవంతంగా పరీక్షించారు. ధ్వని అనేది హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం (HGV), ఇది బాలిస్టిక్ బూస్టర్ ద్వారా అధిక ఎత్తుకు ఎగరడంతో పాటు గాలిలో గ్లైడ్ అవుతుంది.
వేగం – పరిధి: ఈ క్షిపణి వేగం ధ్వని వేగం కంటే 6 రెట్లు ఎక్కువ. ఇది శత్రువు ప్రతిచర్య సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
ఉపయోగాలు: సాధారణ, వ్యూహాత్మక దాడులకు ఈ క్షిపణులు పనికి వస్తాయి. శత్రు భూభాగంలోకి లోతుగా, కచ్చితమైన దాడులకు విశేషంగా ఉపయోగపడుతుంది.
ప్రధాన అడుగు: DRDO ఇటీవల స్క్రామ్ జెట్ దీర్ఘ-శ్రేణి పరీక్షలను నిర్వహించింది. ఇది హైపర్సోనిక్ ప్రొపల్షన్ వైపు ఒక ప్రధాన అడుగుగా అభివర్ణిస్తున్నారు.
ఈ క్షిపణిని గాలి, సముద్రం, భూమి నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి 1,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ARDC), డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వేడి-నిరోధక సిరామిక్స్, పూతలను కలిగి ఉంటుంది.
బ్రహ్మెస్తో దీనికి పోలిక..
బ్రహ్మోస్ క్షిపణిని ఇండో-రష్యన్ సంయుక్తంగా తయారు చేసింది. ఇది మాక్ 3 (3704 కిమీ/గం) వేగంతో 290-600 కిలోమీటర్ల పరిధితో శత్రువుపై దాడి చేస్తుంది. దీనిని Su-30MKI విమానాలు, INS విక్రాంత్ వంటి నౌకలలో మోహరిస్తారు. అయితే ఇది మాక్ 5 కంటే ఎక్కువగా ఎగురుతుంది, 10 నిమిషాల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకుంటుంది. సోనిక్ క్షిపణి గ్లైడ్ మార్గం సక్రమంగా ఉండదు, ఇది రాడార్ నుంచి తప్పించుకుంటుంది. బ్రహ్మోస్ రామట్ ప్రొఫైల్‌ను మరింత సులభంగా ట్రాక్ చేయవచ్చు. S-400 వంటి వాయు రక్షణ వ్యవస్థలపై ధ్వని క్షిపణి చొచ్చుకుపోతుంది. బ్రహ్మోస్ కచ్చితమైనదని, కానీ ధ్వని క్షిపణి దాని కంటే ప్రత్యేకమైనదని DRDO శాస్త్రవేత్త ఒకరు అన్నారు.
అగ్రదేశాల సరసన భారత్..
ఈ క్షిపణి ప్రయోగాలు విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారతదేశం చేరుతుంది. హైపర్సోనిక్ ఆయుధాలు శత్రువు ప్రతిస్పందనను క్లిష్టతరం చేస్తాయి. ఇవి ఆధునిక యుద్ధ సమతుల్యతను మార్చగలవు. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను నిర్మిస్తున్న ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతం కూడా ఈ క్షిపణి పరిధిలోనే ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. చైనా DF-17, రష్యా అవన్గార్డ్ వంటి క్షిపణులకు వ్యతిరేకంగా భారతదేశం రక్షణను ధ్వని క్షిపణిని బలోపేతం చేస్తుంది. ఇటీవల కాలంలో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట, హిందూ మహాసముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో ఈ ధ్వని క్షిపణి భారతదేశానికి “ప్రాంప్ట్ గ్లోబల్ స్ట్రైక్” సామర్థ్యాన్ని అందిస్తుందని అంటున్నారు. దీనిని AMCA ఫైటర్ లేదా అగ్ని-VI బూస్టర్‌తో విస్తరించవచ్చని చెబుతున్నారు.
ఎప్పుడు పరీక్షిస్తారంటే..
ఈ క్షిపణిని 2025న తీరప్రాంత ప్రయోగ ప్రదేశం నుంచి పరీక్షించనున్నారు. ఇది ఎయిర్‌ఫ్రేమ్ ,మార్గదర్శక వ్యవస్థను ధృవీకరిస్తుందని సమాచారం. ఈ క్షిపణికి సంబంధించి 2027 నాటికి వ్యూహాత్మక దళాల కమాండ్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. 2029-30 నాటికి ఈ క్షిపణి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. దీనిని ఆత్మనిర్భర్ భారత్‌లో అభివృద్ధి చేస్తున్నారు. హైపర్సోనిక్ పరిశోధన, అభివృద్ధి కోసం రూ.25 వేల కోట్ల నిధి ఉంది. భద్రతా కేబినెట్ కమిటీ (CCS) దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.
READ ALSO: Indo Thai Securities Share: లక్షాధికారులను చేసిన రెండు రూపాయల షేర్లు..