ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో సహా.. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రైసీకి నివాళిగా భారత్‌లో (రేపు) మే 21న ఒక రోజు సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలోనూ భారత్ మూడు రోజులు సంతాప దినాలు పాటించింది.
Deepika Padukone : దీపికా పదుకొనే బేబీ బంబ్స్ ఫొటోస్ వైరల్..
కాగా.. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిత్-అబ్దుల్లాహియాన్ మరియు పలువురు ఇతర అధికారులు మరణించారు. వారు ప్రయాణించే హెలికాప్టర్ దేశంలోని వాయువ్య ప్రాంతంలోని పొగమంచు, పర్వత ప్రాంతంలో కూలిపోయింది. కాగా.. ఈ విషయాన్ని కొన్ని గంటల తర్వాత ఇరాన్ స్టేట్ మీడియా నివేదించింది.
Love Matter: అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, ఆ దేశ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.