India’s Big Sports Day: క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్‌జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు చారిత్రాత్మక ప్రత్యర్థుల మధ్య ఓకే రోజు ఆట ఉత్సాహభరితంగా మారునుంది. ఈ జట్లు తుఫానును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది.
READ MORE: PM Modi: గోవులు జంతువుల్లా కనిపించవు..”జంతు ప్రేమికుల”పై ప్రధాని సెటైర్లు..
దుబాయ్ మైదానంలో భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. రెండు దేశాల జట్లు మొదటిసారిగా తలపడుతున్నందున ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదిగా పరిగిణిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణపై వ్యతిరేకత సైతం తారాస్థాయికి చేరుకుంది. అయినప్పటికీ.. ఎప్పటిలాగే ఉత్సాహం మాత్రం తగ్గదు. ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు దేశాలు T20 మ్యాచ్‌లలో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 9 సార్లు గెలవగా.. పాక్ 3 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆ మ్యాచ్‌లో భారత్ బాల్ అవుట్ రూల్ ద్వారా గెలిచింది. ఆసియా కప్ లోనూ భారత్‌దే పైచేయి. రెండు జట్లు టీ20 ఫార్మాట్ లో 3 సార్లు తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిచింది.
READ MORE: Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత సక్సెస్.. కలలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్!
మహిళల హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా, భారత్ తలపడనున్నాయి. భారత మహిళా హాకీ జట్టు జపాన్‌తో 1-1తో డ్రాగా ముగిసింది. భారత జట్టు దృష్టి చైనా, కొరియా మధ్య జరిగే మ్యాచ్‌పై పడింది. ఈ మ్యాచ్‌లో సూపర్ 4 దశలోని చివరి మ్యాచ్‌లో కొరియాను 1-0 తేడాతో ఓడించి ఆతిథ్య జట్టు చైనా ఫైనల్‌లోకి ప్రవేశించింది. కొరియా ఓటమితో భారత జట్టు ఫైనల్‌కు టికెట్ ఖరారైంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే.. భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది.
