NTV Telugu Site icon

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌.. డబుల్ గోల్డ్

Chess

Chess

బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడ‌ల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళల జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భార‌త ప్లేయ‌ర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ ల‌లో స‌త్తా చాట‌డంతో భార‌త పురుషుల జ‌ట్టు గోల్డో మెడ‌ల్ గెలుచుకుంది. ర‌ష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై డీ గుకేశ్ విక్టరీ సాధించడంతో దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు.

Read Also: Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్

బుడాపెస్ట్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడంతో భారత్ రెండో స్వర్ణం అందుకుంది. కజకిస్థాన్‌ను అమెరికా ఓడించడంపైనే ఓపెన్ విభాగంలో భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. ఆదివారం అమెరికా తన ప్రత్యర్థిని 1-1తో డ్రా చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు.

Read Also: Devara Latest Update: స్టేజ్ మీద బారికేడ్లు.. ఎన్టీఆర్ తో మాట్లాడించే యత్నం?

అంతకుముందు శుక్రవారం (సెప్టెంబర్ 20) భారత పురుషుల జట్టు ఇరాన్‌పై 3.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఓపెన్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా.. భారత పురుషుల జట్టు 2014 ఎడిషన్‌లో కాంస్యం, 2022లో కాంస్యం గెలుచుకుంది.