Site icon NTV Telugu

Covid-19: కరోనా డేంజర్ బెల్స్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

Corona

Corona

Covid-19: దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు. గతంలో కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కేంద్ర, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కొవిడ్ ప్రోటోకాల్ అమలును కొనసాగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రేపు, ఎల్లుండి జిల్లా స్థాయిలో ప్రజారోగ్య అధికారులతో కొవిడ్ సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కేంద్ర ఆరోగ్యమంత్రి కోరారు.

ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కోరింది. కొవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్-19 నిర్వహణ కోసం సంసిద్ధతతో ఉండాలని కేంద్ర సర్కారు సూచించింది. అత్యవసర హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, కొవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం , ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించుకోవలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.

Read Also: Rishi Sunak: గర్వించదగ్గ రోజు.. సుధామూర్తికి దక్కిన గౌరవంపై స్పందించిన రిషి సునాక్

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా యి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నా యి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 13 శాతం ఎక్కు వగా కేసులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత ఇప్పు డే తొలిసారిగా కేసుల సంఖ్య
6 వేలను దాటింది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దేశంలో పెరుగుతున్న కేసులకు XBB1.16 వేరియంట్ కారణం అవుతోంది. అయితే ఈ వేరియంట్ మరణించేంత ప్రభావం చూపించదు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Exit mobile version