India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1..
- 25 ఏళ్లలో అమెరికాను భారత్ దాటేస్తుంది..
- భారత్ ఆర్థిక వ్యవస్థపై యూఎస్ ఆర్థికవేత్త జేఫ్రీ సాక్స్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: ప్రపంచ సంక్షోభాల మధ్య భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే చెప్పాయి. ఇప్పుడు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త జేఫ్రీ సాక్సా్ భారత్ నెంబర్-1 ఆర్థిక వ్యవస్థగా మారతుందని సంచలన అంచనా వేశారు. సమీపం భవిష్యత్తులో భారత్ అమెరికా, చైనాలను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు.
రాబోయే 25 ఏళ్లలో అమెరికాను భారత్ అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని, చివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించవచ్చని జేఫ్రీ సాక్స్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రం నిర్ణయాత్మకంగా ఆసియా వైపు మారుతోందని సాక్స్ పేర్కొన్నారు. భారత్-చైనాలు ఒకరికి ఒకరు అవసరమని అన్నారు. ఈ రెండు ఆసియా దిగ్గజాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మారుతాయని, అదే సమయంలో అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. చైనాతో భారత్‌కు లోతైన ఆర్థిక, సాంకేతిక సంబంధాలు భారత్ ఎదిగే వేగాన్ని మరింత పెంచొచ్చని వెల్లడించారు.
Also Read
భారత్‌కు చైనా ఎంత అవసరమో, చైనాకు భారత్ అంతే అవసరమని చెప్పారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్న ఆసియా, తిరిగి మళ్లీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంటుందని జేఫ్రీ సాక్స్ అన్నారు. చైనా, ఆసియాన్, ఆఫ్రికా మరియు గల్ఫ్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక మరియు ఆర్థిక సంబంధాలు మరింత ముఖ్యమైనవిగా మారతాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?