Food Security: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పదో నెలలోకి ప్రవేశించింది. పది నెలలు అవుతున్నా ఆ రెండు దేశాలు ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార భద్రత క్షీణించడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు భారతదేశం మంగళవారం తెలిపింది. “ప్రతేక ఆర్థిక సాయంతో ఐక్యరాజ్యసమితి మానవతా, విపత్తు సహాయ సహకారాల సమన్వయాన్ని బలోపేతం చేయడం” అనే అంశంపై మాట్లాడుతూ భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రవీంద్ర ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. “ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార భద్రత క్షీణించడం పట్ల స్వీడన్, భారతదేశం ప్రత్యేకించి ఆందోళన చెందుతున్నాయి” అని భారత్, స్వీడన్ తరఫున రాయబారి రవీంద్ర ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
Digital Payments : వాడకం అంటే ఇది.. డిజిటల్ పేమెంట్సా మజాకా..!
భారతదేశం, స్వీడన్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. నవంబర్ 17న ప్రకటించిన విధంగా 120 రోజుల పాటు పొడిగించడాన్ని స్వాగతించాయి.. అంటే ఉక్రేనియన్ ధాన్యం, ఆహార పదార్థాలు, ఎరువుల ఎగుమతి నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి కొనసాగుతుందని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల, ఆహారపదార్థాల కొరతకు వ్యతిరేకంగా పేద దేశాలకు సహాయం చేయడానికి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌తో సహా అవసరమైన దేశాలకు 1.8 మిలియన్ టన్నులకు పైగా గోధుమలను ఎగుమతి చేసిందని రవీంద్ర పేర్కొన్నారు. భారతదేశ దౌత్యవేత్త తాజా గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఓవర్‌వ్యూ నివేదికను కూడా పేర్కొన్నారు. ఇది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న మానవతా సవాళ్లను వివరంగా వివరిస్తుంది.