Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పు డు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గం టల్లో 2,151 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 11,903 కి పెరిగాయి. ఏడు మరణాలతో మరణాల సంఖ్య 5,30,848కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో మూడు మరణాలు, కర్ణాటకలో ఒకటి, కేరళలో మూడు మరణాలు సంభవించాయి.
Read Also: foods to beat the heat: వేడిని అధిగమించడానికి ఈ ఆహారాలు తినండి
రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 శాతంగా నమోదైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్యలో 0.03 శాతం ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,200కి పైగా తాజా రికవరీలతో 4,41,66,925కి పెరిగింది. కోవిడ్ కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 24 గంటల్లో 11,336 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు, 95.20 కోట్ల సెకండ్ డోసులు, 22.86 కోట్ల బూస్టర్ డోసులను అందించింది.