యశస్వి జైస్వాల్ సెంచరీ (116*), రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65) ల అర్ధ సెంచరీల కారణంగా, వైజాగ్‌లో జరిగిన మూడవ వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీనితో, టెస్ట్ సిరీస్‌లో తన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9న జరుగనుంది.
Also Read:Harley Davidson X440T: హర్లే డేవిడ్సన్ X440T లాంచ్.. ధరల, ఫీచర్లు ఇవే..
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు సఫారీల జట్టును అలవోకగా అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్వింటన్ డి కాక్ 106 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు, ఇది అతని 23వ ODI సెంచరీ, దక్షిణాఫ్రికా ఓపెనర్ అనేక రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా 67 బంతుల్లో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీ మిస్ అయ్యాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ చేతిలో పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. ఇతర బ్యాట్స్‌మెన్లు: మాథ్యూ బ్రీట్జ్కే 24, ఐడెన్ మార్క్రామ్ 1, డెవాల్డ్ బ్రెవిస్ 29, మార్కో జాన్సెన్ 17, కార్బిన్ బాష్ 9, లుంగి ఎన్గిడి 1, ఓట్నీల్ బార్ట్‌మన్ 3 పరుగులు చేశారు.
కె మహారాజ్ అజేయంగా 20 పరుగులు చేశాడు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, కృష్ణ 9.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ కు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. తొలి వికెట్ కు 155 బంతుల్లో 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ను అవుట్ చేయడం ద్వారా మహారాజ్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. సెంచరీకి చేరువలో ఉన్న రోహిత్ పెద్ద షాట్ కు ప్రయత్నిస్తుండగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో, రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ లో 20,000 పరుగులకు చేరుకున్నాడు.
Also Read:Telangana Rising Global Summit : కళ్లుచెదిరేలా ఏర్పాట్లు.. ఎన్నో స్పెషల్ ఎట్రాక్షన్స్
రోహిత్ ఔటైన తర్వాత, ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. యశస్వి 111 బంతుల్లో సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో, విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్లు, ఫోర్లు బాదుతూ భారీ షాట్లు కొట్టాడు. విరాట్ 40 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. భారత్ 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి 116 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
