ఇండియాలో కొత్తగా 12,885 కేసులు, 461 మరణాలు

ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 461 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 15,054 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,579 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,37,12,794 కు పెరగగా.. కోవిడ్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,59,652 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,90,920 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,07,63,14,440 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.