Site icon NTV Telugu

India-Bangladesh: “ఇక నో ఎంట్రీ..” బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్..

India Bangladesh

India Bangladesh

బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్‌ షిప్‌మెంట్‌ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. ‘‘భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమైవున్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం. ఇదొక పెద్ద ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తోంది. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’’ అని యూనస్ చైనాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

READ MORE: Moto G Stylus 5G: మోటరోలా నుంచి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్.. ఫీచర్లు ఇవే!

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న.. 2020లో ఇచ్చిన ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్‌ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘‘జూన్ 29, 2020 తేదీన ఇచ్చిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేశాం. భారత్‌లోకి ఇప్పటికే ప్రవేశించిన కార్గో రవాణాకు అనుమతి ఉంది’’ అని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. 2020 ఉత్తర్వుల ప్రకారం.. బంగ్లాదేశ్ తన ఎగుమతులను భారత్ మీదుగా నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలకు పంపుతుంది. తాజాగా ఈ అనుమతులు రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు మేలు చేకూరె అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టెక్స్‌టైల్‌, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులకు ప్రయోజనం చూకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.

READ MORE: Kangana Ranaut : నా ఇంటికి లక్ష కరెంట్ బిల్ వేస్తారా.. కంగనా ఫైర్

బంగ్లాదేశ్ చైనాకు రెడ్ కార్పెట్..
చైనాలో యూనస్ ప్రకటన కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, యూనస్ ఉద్దేశాలు స్పష్టంగా కనిపించాయి. ఆయన తనను తాను ఈ ప్రాంతానికి సముద్ర సంరక్షకుడిగా ప్రకటించుకోవడమే కాకుండా, చైనా ఈశాన్య భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని కూడా వాదించాడు. ఇది భారతదేశ సార్వభౌమాధికారం, వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రత్యక్ష దాడిగా పరిగణించబడుతోంది.

Exit mobile version