Site icon NTV Telugu

IND vs AUS: నేడే ఆస్ట్రేలియాతో భారత్‌ చివరి వన్డే.. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలిపేనా..?

Aus

Aus

IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. కంగారుల జట్టును ఆపడం గిల్ సేనకు అంత తేలిక కాదు. ఇక, తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అయితే రెండు వన్డేలో కోహ్లీ డకౌటవడం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది . ఈ వైఫల్యానికి తోడు పెవిలియన్‌కు వెళ్తూ అతను ఫ్యాన్స్ కు అభివాదం చేయడంతో తన రిటైర్మెంట్‌పై ప్రచారం కొనసాగుతుంది. చివరి వన్డేలోనూ విఫలమైతే అతడి రిటైర్మెంట్‌పై చర్చ మరింత ఊపందుకుంటుంది. మరి తన ఆటతో విమర్శకులకు కోహ్లీ ఎలా సమాధానం చెబుతాడో చూద్దాం. అలాగే, రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రోహిత్‌పై ఒత్తిడి తగ్గినట్లే.. కానీ అతను అడిలైడ్‌లో సహజ శైలిలో ఆడలేకపోయాడు.

Read Also: Peeing on Road: అసలు వీడు మనిషేనా.. కారు డోర్ తీసి ఏంట్రా ఆ పని…

కాగా, సిడ్నీలో జరిగే వన్డే మ్యాచ్ లో హిట్‌మ్యాన్‌ తన మార్కు ఇన్నింగ్స్‌ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, వన్డే కెప్టెన్‌ అయ్యాక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్‌గా గిల్ విఫలవడం, వరుస ఓటములు ఎదుర్కోవడం అతడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. శుభ్ మన్ నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ కోరుకుంటుంది. శ్రేయస్, రాహుల్, అక్షర్‌ మంచి లయలోనే బ్యాటింగ్ చేస్తున్నారు. నితీశ్‌ కుమార్‌ ఫామ్‌ సైతం జట్టును కలవరపాటుకు గురి చేస్తోంది. వాషింగ్టన్‌ సుందర్, హర్షిత్‌ రాణాల ఎంపిక మీదా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్, ప్రసిద్ధ్ లను తుది జట్టులో ఆడించకపోవడంపై కూడా కోచ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరి చివరి వన్డేలో అయినా వీరికి అవకాశం దక్కుతుందే లేదో.

Read Also: Off The Record : పోచారం పార్టీ మారడాన్ని KCR పర్సనల్గా తీసుకున్నారా..?

అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టమే అని చెప్పాలి. స్టార్క్, హేజిల్‌వుడ్, బార్ట్‌లెట్‌ల బౌలింగ్ ను ఎదుర్కోవడం టీమిండియా బ్యాటర్లకు పెను సవాలు అని చెప్పాలి. గత మ్యాచ్‌లో స్పిన్నర్‌ ఆడమ్ జంపా కూడా రెచ్చిపోయాడు. బౌలింగే కంగారు జట్టు ప్రధాన బలం. సిడ్నీలో బ్యాటింగ్‌ చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఆసీస్‌ బౌలర్లను కాచుకోవడం అంత ఈజీ మాత్రం కాదు. ఇక, వారి బ్యాటింగ్‌లో మిచెల్‌ మార్ష్, షార్ట్, కనోలీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. హెడ్‌ తనదైన శైలిలో చెలరేగకపోవడం కాస్త ఊరట కలిగే అంశం. కానీ చివరి వన్డేలో అతను ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. కాగా, ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఆసీస్ ప్లాన్ చేస్తుంది.

Exit mobile version