India Budget Tradition: కేంద్ర బడ్జెట్‌కి ముందు ఆర్థిక మంత్రికి దహీ-చినీని ఎందుకు తినిపిస్తారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Budget Tradition:భారతదేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్‌ను నేడు ( ఫిబ్రవరి 1న) పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11. 24 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7.9 శాతం వృద్ధిగా అంచనా వేస్తున్నారు.
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
బడ్జెట్‌కు ముందు దహి-చీనీ వేడుక:
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శుభ సంకేతాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి ఏడాది ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ కి ముందు పెరుగు-చక్కెర (దహీ- చినీ) వేడుక ప్రత్యేక సంప్రదాయంగా వస్తుంది. బడ్జెట్ ప్రవేశానికి ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రాష్ట్రపతిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు-చక్కెర (దహీ- చినీ)ని తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, భారతీయ సంప్రదాయంలో పెరుగు, చక్కెర శుభప్రదం, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆచారం బడ్జెట్ విజయవంతంగా పూర్తవాలని, దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తూ నిర్వహించబడుతుంది.
Read Also: Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!
బడ్జెట్ ప్రవేశాల రికార్డు:
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేసాయ్ రికార్డు కొనసాగుతోంది. ఆయన మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. 1959 నుంచి 1964 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఆరు బడ్జెట్లు, 1967 నుంచి 1969 మధ్య నాలుగు బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. ఇక, రెండో స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఉన్నారు. ఆయన మొత్తం 9 బడ్జెట్లు ప్రవేశ పెట్టగా.. నేటి బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ పి.చిదంబరం రికార్డును సమానం చేయనున్నారు. మొరార్జీ దేసాయ్ చారిత్రక రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఆమె ఉన్నారు. కాగా, దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, మధ్య తరగతి ఆశలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ కీలక ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?