NTV Telugu Site icon

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. నేడు జరిగే పోటీలు

India At Common Wealth Games

India At Common Wealth Games

Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇందులో 5 స్వర్ణాలు, 5రజతాలు, 3 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో మంగళవారం భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్‌ ఫోర్స్‌ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. ఇవాళ కూడా పలు క్రీడల్లో భారత్‌కు చెందిన అథ్లెట్లు పాల్గొననున్నారు. మరి ఇవాళ ఏయే విభాగాల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారో తెలుసుకుందాం.

వెయిట్‌లిఫ్టింగ్‌: లవ్‌ప్రీత్‌సింగ్‌, పురుషులు 109 కేజీలు (మధ్యాహ్నం 2 గంటల నుంచి); పూర్ణిమ పాండే, మహిళలు 87 కేజీలు (సా.6.30 గంటల నుంచి); గుర్‌ప్రీత్‌ సింగ్‌, పురుషులు 109 కేజీలు (రా.11 గంటల నుంచి); గగన్‌దీప్‌, పురుషులు 109 కేజీల పైన (రా.11 గంటల నుంచి)

జూడో: తులిక, మహిళలు 78 కేజీలపైన (మ.2.30 నుంచి); దీపక్‌, పురుషులు 100 కేజీలు (మ.2.30 నుంచి)

హాకీ: భారత్‌ × కెనడా, మహిళలు (మ.3.30 నుంచి); భారత్‌ × కెనడా, పురుషులు (సా.6.30 నుంచి)

లాన్‌బౌల్స్‌: భారత్‌ × దక్షిణాఫ్రికా, మహిళల పెయిర్‌ (సా.4 నుంచి)

బాక్సింగ్‌: హుసాముద్దీన్‌, 57 కేజీలు (సా.5.45 నుంచి); నీతు, 48 కేజీలు (సా.4.45 నుంచి); నిఖత్‌ జరీన్‌, 50 కేజీలు (రా.11.15 నుంచి); లవ్లీనా, 70 కేజీలు (రా.12.45 నుంచి)

క్రికెట్‌ (మహిళలు): భారత్‌ × బార్బడోస్‌ (రా.10.30 గంటల నుంచి)

అథ్లెటిక్స్‌: మన్‌ప్రీత్‌కౌర్‌, మహిళల షాట్‌పుట్‌ ఫైనల్‌ (రా.12.35 నుంచి)

Show comments