2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందినదిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్, సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇందుకు అనుగుణంగానే అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి పలు కీలక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు.
Read Also: Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
భారత్‌లో యువతకు కొదవలేదని, వారి నైపుణ్యాలను మరింత పదును పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఇంకా వృద్ధిలోకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉందని ఆమె అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తగ్గట్టుగానే వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల కల్పనపై రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోకి పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
Read Also: Sunday Stotram: స్తోత్ర పారాయణం చేస్తే యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కాకుండా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వీటితో పాటు ఇన్నోవేషన్‌కు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అంతరిక్షం, న్యూక్లియర్ ఎనర్జీ తదితర రంగాలపై కూడా నజర్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న.. చేపట్టబోయే పనులతో వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని ఆమె వెల్లడించారు.
