India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India advisory Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు సర్దుమణుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించారు. శాశ్వత పరిష్కరం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు.. కాల్పల విరమణపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం మరో కొత్త అడ్వైజరీని జారీ చేసింది. అక్కడ ఇంకా మిగిలి ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని రాయబార కార్యాలయం సూచించింది. ఏప్రిల్ 7న ఇచ్చిన ‘స్టే అట్ హోమ్’ హెచ్చరికల కొనసాగింపుగా ఈ తాజా ప్రకటన వెలువడింది. ముఖ్యంగా ఎవరూ కూడా ముందస్తు సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వైపు వెళ్లకూడదని, కేవలం ఎంబసీ సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
READ MORE: Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాయి. తాను ఇరాన్‌పై విధించిన డెడ్‌లైన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అంతకు ముందు రోజు 48 గంటల డెడ్‌లైన్ విధించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గడం ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే.. తాజాగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ మరో షరతు విధించారు. ఇరాన్ తన క్షిపణి దాడులను ఆపి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే ఈ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ చేరుకుందని, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.
⚠️ Advisory as on 08 April 2026. pic.twitter.com/pusFQIAKKI
— India in Iran (@India_in_Iran) April 8, 2026
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!