Site icon NTV Telugu

Ind A vs Aus A: గ్రౌండ్ ఏదైనా దబిడి దిబిడే.. మెరుపు సెంచరీలతో రెచ్చిపోయిన ఆర్య, అయ్యర్..

Shreyas Iyer

Shreyas Iyer

Ind A vs Aus A: భారత్-A, ఆస్ట్రేలియా-A జట్ల మధ్య కాన్పూర్‌లో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-A 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-A నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (110), ప్రియన్స్ ఆర్య (101) సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు రియాన్ పరాగ్ (67), ఆయుష్ బడోని (50), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (56) అర్ధ సెంచరీలు సాధించి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.

Gandhi Jayanthi: బాపూ ఘాట్ కు సీఎం..

ఇక 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు, భారత బౌలర్ల ధాటికి 33.1 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మాకెన్జీ హార్వే (68), లాచ్లాన్ షా (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక భారత్-A బౌలర్లలో నిషాంత్ సింధు 4 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా-A పతనాన్ని శాసించారు. శ్రేయాస్ అయ్యర్ తన అద్భుతమైన సెంచరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version