గోదారి స్థానానికి వెళ్ళిన అన్నదమ్ములకు మిలిటరీలో ఉద్యోగాలు వచ్చాయి. “ఏటేటీ గోదారి తానానికెళితే మిలటరీ ఉజ్జోగాలా…? ఎల్లెళ్లవయ్యా చెప్పొచ్చావు. ఇలాంటి వార్తలతో మూఢనమ్మకాలను పెంచుతావా..” అని తిట్టడం ప్రారంభించకండి. ఇది వాస్తవ సంఘటనే. ఎన్నో విజయ గాథలు మనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అప్పట్లో ఇలాంటి సంఘటనలు జరిగేవా అని కంగారు పుట్టిస్తుంది. అసలు కథ ఏమిటో చూద్దాం….
Also Read : Ben Stokes: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన వీరవల్లి ప్రకాశం సోదరుడు ఇజ్రాయిల్ తో కలసి 1943 సంవత్సరంలో రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్దకు స్థానానికి వెళ్ళారు.వాళ్ళ తండ్రి చంద్రయ్య రాజమహేంద్రవరంలో బ్రిటిష్ దొరల వద్ద బంట్రోతు ఉద్యోగం చేస్తుండటం వల్ల వారూ అక్కడే నివాసం ఉండేవారు. అయితే స్నానికి వెళ్లిన ఆ యువకులు ఇంటికి తిరిగి రాలేదు. కాని గోదారోడ్డున విడిచిపెట్టిన ఆ కుర్రాళ్ల బట్టలు మాత్రం ఉన్నాయి. వారే కాదు ఆరోజు చాలామంది కుర్రాళ్ళు కనిపించకుండా పోయారు. అయితే వారి బట్టలు ఒడ్డున ఉండడం వల్ల వీరంతా గోదారి ప్రమాదంలో మరణించారని భావించారు. అప్పట్లో గోదావరి ఒడ్డున బట్టలు ఉంటే ఆ వ్యక్తులు మరణించినట్లే లెక్క. ఎందుకంటే అప్పట్లో ఇప్పటిలా సీసీ కెమెరాలు,సెల్ పోన్ నెట్‌వర్క్ సిగ్నల్స్, మరబోట్లు, అధికార యంత్రాంగం, మీడియా చానల్స్ లైవ్‌లు,సోషల్ మీడియా హడావుడులు ఉండేవి కావు. అలా గల్లంతైన వారు ఇకలేరనే లెక్కగా ఉండేది. చనిపోయారని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తరుణంలో అంటే సుమారు ఆరు నెలల తర్వాత ప్రకాశం రాసిన ఓ ఉత్తరం వచ్చింది.
Also Read : Trans fat: ప్రమాదకరంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్.. కొంప ముంచుతున్న చిరుతిండ్లు
నేను మద్రాసు ప్రాంతంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్నాను క్షేమంగానే ఉన్నానని ఆ ఉత్తరం సారాంశం. ఇక ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు.మరికొన్నాళ్ల తర్వాత ఇజ్రాయిల్ నుంచి కూడా ఇలాంటి ఉత్తరమే వచ్చింది.కాని వారిద్దరూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారని స్పష్టమైంది. ఇప్పట్లా అప్పుడు యువకులు మిలటరీలో చేరడానికి పోటీపడేవారు కాదు. అందుకునే బలవంతంగా యువకులను తీసుకెళ్లి చేర్పించేవారు. ఈ విధంగానే ఆరోజు పుష్కర ఘాట్ వద్దకు మెటాడోర్ వ్యాన్ లలో వచ్చి దొరికిన యువకులను బలవంతంగా తీసుకుపోయారు. తీరా అక్కడకు వెళ్ళాక మీరు వయసు, ఆరోగ్య పరిస్థితులు సరిపడక. పోవడంతో ఓ పెద్ద గోడౌన్ లో వీరిని ఉంచి ఆహార పదార్థాలు పెట్టి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరు నెలలపాటు వీరిని తీర్చిదిద్ది సైనికులుగా బాధ్యతలు అప్పగించారు.ప్రకాశంకు మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. ఆయన సర్వీసు రిజిస్టర్ ప్రకారం 1943 జూలై 26 నుండి 1947 ఏప్రిల్ 26 వరకూ మిలటరీ ఉద్యోగంలో పనిచేసారు.అంటే రెండవ ప్రపంచ యద్ద సమయంలో ఈయన ఆ ఉద్యోగంలోనే ఉన్నారు.
మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రకాశం , ఇజ్రాయల్ వంటి వారిని బయటకు పంపించి నచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు.అప్పట్లో ఎనిమిదో తరగతి వరకూ చదివిన వీరిద్దరూ ఉపాద్యాయులుగా పనిచేయడానికి ఇష్టపడ్డారు. ప్రకాశం సొంతూరైన వేమగిరిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులుగా చేరి పదిహేను సంవత్సరాలు అక్కడే పని చేసారు.ఆ తర్వాత మల్లిపూడి,దుప్పలపూడి,వీరవరం పాఠశాలలలో పనిచేసారు. వీరవరంలో పదవీ విరమణ పొందారు.ప్రకాశం 2002 డిసెంబరు 16 న మృతి చెందారు.
Also Read : Telangana Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..
ప్రకాశం లాంటి వారి జీవితాలను వెలిగినిచ్చిన కార్యక్రమం “నా భూమి-నా దేశం” కార్యక్రమం. “నేల తల్లికి నమస్కారం- వీరులకు వందనం” పేరుతో ఆగష్టు15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం పల్లెల్లో, పట్టణాల్లో స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తులను గుర్తించి వారి వారసులను సత్కరించే ఈ కార్యక్రమం మంచి ఆదరణ పొందుతుంది. ఇందులో భాగంగానే వేమగిరిలో ప్రకాశం కుమారుడు ప్రభుదాసును ఘనంగా సత్కరించారు. ఒక్క ప్రకాశం,ఇజ్రాయిల్ లే కాదు ఇలాంటి ఎందరో జీవితాలు ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
