Nani: మీకు ఉప్మాలో జీడిపప్పు వస్తుందా?.. కానిస్టేబుళ్లతో హీరో నాని జోకులు!
- ట్రైనీ కానిస్టేబుళ్లతో నాని ముచ్చట్లు
- మీకు ఉప్మాలో జీడిపప్పు వస్తుందా
- పోలీసు ఆఫీసర్‌గా నటించబోతున్నా
Nani Jokes With Constables at Independence Day 2024 Event: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో ‘నేచురల్ స్టార్’ నాని ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ‘పిల్ల జమిందార్’ సినిమాను గుర్తుచేయగా.. నాని సరదాగా నవ్వుకున్నారు. అంతేకాదు ‘మీకు ఉప్మాలో జీడిపప్పు వస్తుందా?’ అని జోకులు పేల్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీజే (పిల్ల జమిందార్) సినిమాలోని ఎన్ఎన్‌సీసీ క్యాంపు అనుభవం గురించి ప్రకాష్ అనే కానిస్టేబుల్ అడగ్గా… ‘అయ్యయ్యో జోబులో డబ్బులు పోయెనే.. పీజే అనగానే నాకు ఈ పాటే గుర్తొస్తుంది. ఎన్ఎన్‌సీసీ క్యాంపులో చాలా కష్టపడ్డాను. ఫన్నీగా షూట్ చేశాం కాబట్టి.. అందరం ఎంజాయ్ చేశాం. పీజేలో అదే హైలెట్ ఎపిసోడ్. నాకు ఉప్మాలో జీడిపప్పు వచ్చింది.. నేను లక్కీ బాయ్. ఇప్పటికీ నేను అది మర్చిపోను. మీకు ఇక్కడ ఉప్మాలో జీడిపప్పు వస్తదా?. అసలు ఇక్కడ ఉప్మా ఉంటుందా?. అందరు నవ్వుతున్నారు అంటే.. జీడిపప్పులు రావేమో అని నా డౌట్’ అని నాని జోకులు పేల్చారు.
Also Read
Also Read: Rishabh Pant-DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో రిషబ్ పంత్!
మీరు ఎప్పుడు పోలీసు పాత్రలో నటిస్తారు? అనే ప్రశ్నకు.. ‘ఆ విషయాన్ని ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు. ఇదే సరైన వేదిక అని అనుకుంటున్నా. నా కొత్త సినిమా సరిపోదా శనివారం ఆగష్టు 29న అవుతోంది. మరికొన్ని రోజుల్లోనే నా తదుపరి ప్రాజెక్టు ప్రకటిస్తా. అందులోనే నేను పోలీసు ఆఫీసర్‌గా నటించబోతున్నా’ అని నేచురల్ స్టార్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?