IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- జింబాబ్వేతో మూడో టీ20
- భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు
- జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యం..
- హర్మన్‌ప్రీత్ కౌర్ 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు
- షఫాలి వర్మ 37 బంతుల్లో 69 పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 221.95 స్ట్రైక్‌రేట్‌తో అజేయంగా 91 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన హర్మన్‌ప్రీత్ తృటిలో సెంచరీ చేజార్చుకుంది.
ఓపెనర్ షఫాలి వర్మ కూడా దూకుడుగా ఆడింది. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసింది. అలాగే అనుష్క శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసింది. నికీ ప్రసాద్ 9 పరుగులు చేయగా, రిచా ఘోష్ ఒక పరుగుకే వెనుదిరిగింది. దీప్తి శర్మ ఖాతా తెరవకుండానే ఔటైంది. జింబాబ్వే బౌలర్లలో బెలవ్డ్ బిజా మూడు వికెట్లు పడగొట్టింది. నోమ్వెలో సిబాండా, టెండాయ్ మకుషా, న్యాషా గ్వాంజురా తలో వికెట్ తీశారు.
Also Read
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- 165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
Incredible hit 💪
Applause and appreciation all around 👏Scorecard ▶️ https://t.co/JQfrsq5B2K
#TeamIndia | #INDvZIM | @mflone_ | @ImHarmanpreet https://t.co/NoiaemtX0j
— BCCI Women (@BCCIWomen) October 20, 2026
There’s no catching that! 🔥
🎥 Shafali Verma with some mega maximums 👌
Updates ▶️ https://t.co/JQfrsq5B2K
#TeamIndia | #INDvZIM | @mflone_ | @TheShafaliVerma https://t.co/pb4JiGZtlJ
— BCCI Women (@BCCIWomen) October 20, 2026
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!