IND W vs SA W T20 Series: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ సజావుగా సాగుతున్న వేళ.. భారత క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే ట్రీట్ సిద్ధమైంది. ఏంటి ఐపీఎల్ ఉండగా మరో సీరిస్ ఏంటనే కదా మీ అనుమానం.. మరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ టీ20 సిరీస్ భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య జరగనుంది. ఇందుకోసం టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లి, ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకంగా కానుంది.
Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దీనికి కారణం.. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు చివరి ప్రిపరేషన్‌గా నిలుస్తుంది. ఇక ఈ సిరీస్ మొదటి టీ20 మ్యాచ్ ఏప్రిల్ 17, 2026 (శుక్రవారం) డర్బన్ లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరగనుంది. ఇది నైట్ మ్యాచ్ కావడంతో.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ రాత్రి 9:00 గంటలకు జరుగుతుంది. ప్రస్తుతం ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్క టీ20 వరల్డ్ కప్‌ను గెలవలేకపోయింది. దీనితో ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇందుకోసం ఈ సిరీస్ తో మంచి ప్రిపరేషన్ సంపాదించి, ఆ లోటును తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో స్మృతి మంధానా, షెఫాలి వర్మా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరితో పాటు యువ ప్రతిభకు ఉండడంతో జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
సిరీస్ పూర్తి షెడ్యూల్:
ఏప్రిల్ 17: తొలి టీ20 – రాత్రి 9:30
ఏప్రిల్ 19: రెండో టీ20 – సాయంత్రం 5:30
ఏప్రిల్ 22: మూడో టీ20 – రాత్రి 9:30
ఏప్రిల్ 25: నాల్గో టీ20 – రాత్రి 9:30
ఏప్రిల్ 27: ఐదో టీ20 – సాయంత్రం 5:3.
భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధానా (VC), షెఫాలి వర్మా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), అరుంధతి రెడ్డి, రెణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పటిల్, కాశ్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.
దక్షిణాఫ్రికా మహిళల జట్టు:
లారా వూల్వార్ట్ (C), అనేకే బోష్, టాజ్‌మిన్ బ్రిట్స్, నడీన్ డి క్లెర్క్, అనెరీ డెర్క్సెన్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, అయాబోంగా ఖాఖా, సునే లూస్, టెబోగో మాచెకే, ఎలిజ్-మారీ మార్క్స్, నాన్‌కులులెకో మ్లాబా, కయ్లా రెనెకే, టూమి సేఖుఖునే, క్లోయి ట్రియోన్.
