IND W vs SA W: ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా.. భారత్ ఘన విజయం
- ట్రై సిరీస్‌లో భారత్ మహిళల జట్టు ఖాతాలో మరో విజయం.
- ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా..
- తజ్మిన్ బ్రిట్స్ శతకం వృధా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs SA W: శ్రీలంకలో జరుగుతున్న మహిళల మూడు జట్ల మధ్య వన్డే ట్రై సిరీస్‌లో భారత్ మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రతికా రవాల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 78 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించింది. ఇక భారత మిగతా బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ (41), హర్మన్‌ప్రీత్ కౌర్ (41 నాటౌట్), స్మృతి మంధానా (36), రిచా ఘోష్ (24)లు సమిష్టిగా రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు తీసింది. ఖాఖా, క్లాస్, డె క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: TGSRTC Strike: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఎప్పటినుంచంటే?
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇక 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ 109 పరుగులతో సెంచరీ సాధించినా, మిగతా బ్యాటర్లు సరైన మద్దతు ఇవ్వలేకపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. కెప్టెన్ వోల్వర్డ్ట్ 43 పరుగులు చేయగా, చివర్లో డెర్క్సెన్ 30 పరుగులతో కొంత పోరాటం చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక భారత్ బౌలింగ్ వైపు నుంచి ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా అద్భుత ప్రదర్శన చేసింది. 43 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టు ఛేజింగ్‌ను దెబ్బతీసింది. అలాగే దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్నేహ రాణా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డుకు ఎంపికయ్యింది.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
ఈ విజయం ద్వారా భారత్ మహిళల జట్టు సిరీస్‌లో తమ రెండవ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమిష్టిగా రాణించిన భారత్ జట్టు వచ్చే మ్యాచ్‌లకు మంచి మోమెంటంను సంపాదించుకుంది. మొత్తానికి, తజ్మిన్ బ్రిట్స్ శతకం సాధించినా స్నేహ రాణా ఐదు వికెట్లతో బౌలింగ్ ధాటికి భారత మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!