NTV Telugu Site icon

IND vs WI: భారత్‌తో టీ20 సిరీస్‌.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు ఆయేగా

Wi T20 Squad Vs Ind

Wi T20 Squad Vs Ind

West Indies announced squad for T20I series vs India: ప్రస్తుతం వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. వన్డే సిరీస్ అనంతరం ఆగష్టు 3 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యలతో కూడిన జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. విండీస్ టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌ కాగా.. కైల్ మేయర్స్ వైస్‌ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో స్టార్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు.

విండీస్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు నికోలస్‌ పూరన్‌కు టీ20 జట్టులో చోటు ఇచ్చారు. మెజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ ఆడుతున్న పూరన్‌.. వన్డేల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మెజర్‌ లీగ్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పూరన్‌ విధ్వంసం సృష్టించాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. పూరన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేయడంతో ముంబై న్యూయార్క్ టైటిల్ గెలుచుకుంది. త్వరలోనే పూరన్‌ విండీస్ జట్టుతో కలవనున్నాడు. పూరన్‌పై మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది.

Also Read: Stuart Broad Unique Record: చివరి బంతికి సిక్స్‌, వికెట్‌.. క్రికెట్ చరిత్రలో ఏకైక ఆటగాడిగా స్టువర్ట్‌ బ్రాడ్‌!

దాదాపు ఏడాది నుంచి విండీస్‌ టీ20 జట్టుకు దూరంగా ఉన్న హిట్టర్ షిమ్రాన్‌ హెట్‌మైర్‌, వికెట్‌ కీపర్‌ షాయ్‌ హోప్‌, పేసర్ ఒషానే థామస్‌లకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఆడారు. టెస్ట్, వన్డేలను పక్కనపెడితే.. టీ20ల్లో విండీస్ ప్రమాదరక జట్టు. హిట్టర్లు చాలా మంది జట్టులో ఉన్నారు. దాంతో టీమిండియాకు గట్టి పోటీ తప్పదు. ఇక ఆగస్టు 3న ట్రినిడాడ్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో పొట్టి సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆగష్టు 13న ఈ సిరీస్ ముగియనుంది.

వెస్టిండీస్ టీ20 జట్టు (WI T20 Squad vs IND):
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్ (వైస్‌ కెప్టెన్‌), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్ ఓడియన్ స్మిత్, ఒషానే థామస్.

Also Read: Tomatoes Lorry: 21 లక్షల విలువైన టమాటాల లారీ మాయం.. ఎక్కడో తెలుసా?