Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Creates Unique Record in IND vs WI 5th T20I: తెలుగు కుర్రాడు, భారత యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఐదు మ్యాచ్‌ల అనంతరం అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారానే తిలక్ వర్మ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. టీ20 సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. 173 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 51. ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్.. భారత ఆటగాడు దీపక్ హుడాను వర్మ అధిగమించాడు. దీపక్ మొదటి 5 మ్యాచ్‌లలో 172 రన్స్ చేశాడు. భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ 179 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్ధానంలో ఉన్నాడు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కీలకమైన ఐదో టీ20లో ఓడిన భారత్ సిరీస్‌ను 2-3 తేడాతో వెస్టిండీస్‌కు అప్పగించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కెప్టెన్సీ, బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయ్యాడు. ఇక విండీస్ పర్యటన ముగియడంతో భారత్ ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఐర్లాండ్‌కు భారత యువ జట్టు వెళ్లనుంది. డబ్లిన్ వేదికగా ఆగస్టు 18న తొలి టీ20 జరగనుంది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!