Site icon NTV Telugu

Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!

Tilak Varma Record

Tilak Varma Record

Tilak Varma Creates Unique Record in IND vs WI 5th T20I: తెలుగు కుర్రాడు, భారత యువ సంచలనం తిలక్‌ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఐదు మ్యాచ్‌ల అనంతరం అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్‌ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారానే తిలక్‌ వర్మ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. టీ20 సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌.. 173 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 51. ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్‌.. భారత ఆటగాడు దీపక్‌ హుడాను వర్మ అధిగమించాడు. దీపక్‌ మొదటి 5 మ్యాచ్‌లలో 172 రన్స్ చేశాడు. భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 179 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్ధానంలో ఉన్నాడు.

Also Read: Hardik vs Pooran Challenge: దమ్ముంటే నా బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టంటూ సవాల్.. హార్దిక్ దూల తీర్చిన విండీస్ హిట్టర్ పూరన్!

కీలకమైన ఐదో టీ20లో ఓడిన భారత్ సిరీస్‌ను 2-3 తేడాతో వెస్టిండీస్‌కు అప్పగించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమయ్యాడు. ఇక విండీస్‌ పర్యటన ముగియడంతో భారత్‌ ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. ఐర్లాండ్‌కు భారత యువ జట్టు వెళ్లనుంది. డబ్లిన్‌ వేదికగా ఆగస్టు 18న తొలి టీ20 జరగనుంది.

 

 

 

Exit mobile version