IND vs WI 2nd ODI Dream11 Team Prediction: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో సులువుగా గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఇప్పుడు అదే ప్రదర్శనను కొనసాగించి ట్రోఫీ పట్టేయాలని చూస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది. ఈ వన్డేలో భారత్ ఫెవరేట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు విండీస్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో శనివారం (జులై 29) రాత్రి 7 గంటలకు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో కెన్సింగ్‌టన్ ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అదే పిచ్‌పైనే ఈ మ్యాచ్ ఆడితే.. ఇరు జట్లు అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది. మరో పిచ్ అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
Also Read: T20 World Cup 2024: జూన్‌లోనే ప్రపంచకప్.. ఈసారి సరికొత్తగా!
తుది జట్లు (IND vs WI 2nd ODI Playing 11):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్/సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.
డ్రీమ్11 టీమ్ (IND vs WI 2nd ODI Dream11 Team):
కెప్టెన్: కుల్దీప్ యాదవ్
వైస్ కెప్టెన్: రవీంద్ర జడేజా
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్
బ్యాటర్లు: షాయ్ హోప్, కైల్ మేయర్స్, విరాట్ కోహ్లీ
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా
బౌలర్లు: జైడెన్ సీల్స్, గుండకేష్ మోతీ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
Also Read: Sanjay Dutt First Look: బిగ్ బుల్‌గా సంజయ్ దత్.. లుక్ పోలా అదిరిపోలా! కేజీఎఫ్ 2 రేంజ్