IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యంత కీలకమైన చివరి పోరు శనివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో ఐదో టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు మరో అరుదైన అవకాశం కూడా ఉంది. 2002 తర్వాత భారత గడ్డపై ఏ ఫార్మాట్లోనూ వెస్టిండీస్ సిరీస్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని కరీబియన్ జట్టు భావిస్తోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పుగా మారింది. వాతావరణ అంచనాల ప్రకారం బెంగళూరులో సాయంత్రం నుంచి వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం తగ్గి మైదానాన్ని సకాలంలో సిద్ధం చేయగలిగితే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. నివేదికల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు బెంగళూరులో వాతావరణం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి వర్షం పడే అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా. సాయంత్రం 4 గంటలకు వర్షం పడే అవకాశం 68% ఉండగా, 5 గంటలకు 71% , 6 గంటలకు 49% గా అంచనా వేశారు. మ్యాచ్ ప్రారంభ సమయమైన రాత్రి 7 గంటలకు 64% వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి 8, 9 గంటలకు 49% చొప్పున, 10 గంటలకు 56%, 11 గంటలకు 49% వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయి.
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
టీ20 మ్యాచ్‌లో ఫలితం రావాలంటే కనీసం ఇరు జట్లు ఐదు ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ నిర్ణీత సమయం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా ఆలస్యమైతే ఓవర్లను తగ్గిస్తూ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అయితే రాత్రి 10:16 గంటల వరకు తొలి బంతి పడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే కప్ ను ఇరుజట్లు అందుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ కు ఎలాంటి రిజరావ్ డే కూడా లేదు. వర్షం కొంత విరామం ఇచ్చి మైదానాన్ని త్వరగా సిద్ధం చేయగలిగితే తక్కువ ఓవర్లతోనైనా సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ విజేత ఎవరో తేలాలంటే వరుణుడు సహకరించాల్సిందే.
తాజావార్తలు
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?