Site icon NTV Telugu

Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్‌, మెరిసిన తిలక్‌.. మూడో టీ20లో భారత్‌ ఘన విజయం!

Surya

Surya

Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్‌ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్‌ యాదవ్‌ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్‌ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్‌ వర్మ (49 నాటౌట్‌; 37 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో నిలిచింది. ఇక నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రెండన్‌ కింగ్‌ (42; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), కైల్‌ మేయర్స్‌ (25; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. వీరిద్దరు 50 పరుగులు జత చేశారు. అక్షర్‌ పటేల్ ఈ జోడీని విడదీశాడు. చార్లెస్‌ (12), పూరన్‌ (20) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కింగ్‌,హెట్‌మైర్‌ (9) కూడా ఔట్ అయ్యారు. అయితే పావెల్‌ (40 నాటౌట్‌; 19 బంతుల్లో1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో ఇన్నింగ్స్ చివరలో విండీస్ 150కి పైగా రన్స్ చేసింది. కుల్దీప్ యాదవ్‌ (3/28) మూడు వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Guntur Kaaram: లుంగీ లో మహేష్ బాబు.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడోచ్..

లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్‌ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. శుభమాన్ గిల్‌ (6) పేలవ ఫామ్‌ కొనసాగించాడు. ఈ సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ధాటిగా ఆడాడు. ఫోర్స్, సిక్సులు బాదుతూ విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. అతడికి తిలక్‌ వర్మ కూడా జాతవ్వడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య సెంచరీ కోల్పోయాడు. సూర్య అనంతరం హార్దిక్‌ పాండ్యా (20 నాటౌట్‌)తో కలిసి తిలక్ పని ముగించాడు.

 

Exit mobile version