Site icon NTV Telugu

IND vs WI Test: ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి టీమిండియా..

Ind Vs Wi Test (1)

Ind Vs Wi Test (1)

IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నేడు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్‌ను ఘనంగా గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమైంది. ఇక రెండో టెస్ట్ టాస్‌లో అదృష్టం టీమిండియాకే దక్కింది. గిల్ తన కెప్టెన్సీలో తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ గెలిచిన గిల్ వ్యాఖ్యానిస్తూ.. “వికెట్ బాగుంది, ఎక్కువ రన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మంచి ప్రదర్శన కొనసాగించాలి. కెప్టెన్సీ కొంచెం బాధ్యతను పెంచినా, దానిని నేను ఆస్వాదిస్తున్నాను అని అన్నాడు. ఇక మొదటి టెస్టు టీంలో ఆడిన జట్టే ఆడుతుందని, ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు.

Crime: డయల్‌ 100కు ఫోన్‌.. సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్..!

మరోవైపు ఇక వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ పొడిగా ఉంది. మా బ్యాటింగ్‌పై సమావేశాల్లో చర్చించాం. కనీసం 90 ఓవర్లు బ్యాటింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నాడు. ప్రతి బంతిని విలువతో ఆడాలని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ.. బ్రాండన్ కింగ్, అల్‌జారీ జోసెఫ్ బదులుగా టెవిన్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. ఇక నేటి ఇరు జట్లు ప్లేయింగ్ XI ఇలా ఉన్నాయి..

SS Thaman: కీబోర్డే కాదు.. గ్రౌండ్‌లో బౌలర్లను కూడా వాయించేసిన మ్యూజిక్ సెన్సేషన్

భారత్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్:
టాగెనరైన్ చాందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ ఆథనేజ్, షై హోప్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), రోస్టన్ చేస్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.

Exit mobile version