NTV Telugu Site icon

Ishan Kishan Six: విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైంది: ఇషాన్‌ కిషన్

Ishan Kishan Close

Ishan Kishan Close

Ishan Kishan explains reason behind batting ahead of Virat Kohli in IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ యువ వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాన్‌కు ఇదే మొదటి టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనే టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన ఇషాన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడంతో ఎక్కువ రన్స్ చేసే అవకాశం అతడికి రాలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెగ్యులర్‌గా ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్.. దూకుడుగా ఆడి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఒంటిచేత్తో సిక్స్‌ కొట్టి మరీ 50 మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళ్లమని కోహ్లీనే తనకు స్వయంగా చెప్పాడని ఇషాన్ తెలిపాడు. కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైందని పేర్కొన్నాడు. 4 రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్‌ స్పందిచాడు.

Also Read: Wife Marriage: అచ్చు ‘కన్యాదానం’ సినిమా మాదిరి.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త!

ఇషాన్‌ కిషన్ మీడియాతో మాట్లాడుతూ… ‘టెస్టు కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టా. ఈ ఇన్నింగ్స్‌ నాకు ఎంతో ప్రత్యేకమైంది. నా నుంచి జట్టుకు ఏం కావాలనే దానిపై పూర్తి అవగాహన ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు. సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావడానికి కారణం విరాట్ కోహ్లీ. లెఫ్ట్‌ ఆర్మ్ బౌలర్‌ బౌలింగ్‌కు వేస్తుండటంతో నన్ను ముందుకు పంపించారు. విరాట్ కోహ్లీ స్వయంగా న వద్దకు వచ్చి బ్యాటింగ్‌కు వెళ్లమని చెప్పాడు. వర్షం తర్వాత 70 -80 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేద్దామని ముందే అనుకున్నాం. విండీస్‌ ముందు 370-380 పరుగుల లక్ష్యం ఉంచాలనుకున్నాం. అందుకే దూకుడుగా ఆడేశాం’ అని అన్నాడు.

‘ఇలాంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్‌ మరింత దూకుడుగా ఆడేవాడు. మొన్నటివరకు నేను కూడా ఎన్‌సీఏలో ఉన్నా. పంత్ కూడా అక్కడే ఉన్నాడు. మా ఇద్దరికి అండర్-19 నుంచే పరిచయం. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలనే దానిపై పంత్‌ ఇచ్చిన సూచనలు పని చేశాయి. క్రీజ్‌లో ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటే.. పరుగులు చేయడం సులువుగా ఉంటుందో పంత్‌ చెప్పాడు. ఎన్‌సీఏలో ఉన్న సీనియర్ క్రికెటర్లతోనూ మాట్లాడా. ఎపుడూ మద్దతుగా ఉండే నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా కల నెరవేరినట్లుంది’ అని ఇషాన్‌ కిషన్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: Ovarian Cancer Risk: బ్యూటీషియన్స్ బీ అలెర్ట్.. క్యాన్సర్‌ ముప్పు తప్పదు!