NTV Telugu Site icon

WI vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్!

Virat Kohli Shot Test

Virat Kohli Shot Test

West Indies vs India 2nd Test Day 1 Highlights: పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (87 నాటౌట్; 161 బంతుల్లో 8 ఫోర్లు) సెంచరీకి చేరువలో ఉండగా.. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (36 నాటౌట్; 84 బంతుల్లో 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (80; 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, గాబ్రియల్, వారికన్, జేసన్ హోల్డర్‌ తలో వికెట్ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం ఇచ్చారు. నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. రోహిత్‌ నెమ్మదిగా ఆడినా.. జైస్వాల్‌ మాత్రం దూకుడుగా ఆడాడు. తొలి సెషన్లో విండీస్‌ బౌలర్లు భారత ఓపెనర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 19వ ఓవర్లో రోచ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ అర్ధ శతకం (74 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.

Also Read: Gold Price Today: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే?

మరోవైపు యశస్వి జైస్వాల్‌ 23వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 49 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో లంచ్ సమయానికి భారత్ 121/0తో నిలిచింది. లంచ్‌ తర్వాత విండీస్‌ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఆధిపత్యం చెలాయించారు. రెండో సెషన్‌లో భారత్ 61 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. జేసన్‌ హోల్డర్‌ వేసిన 32 ఓవర్‌లో యశస్వి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్.. ద సిల్వాకు క్యాచ్‌ ఇచ్చాడు. సెంచరీకి చేరువలో ఉన్న రోహిత్‌ శర్మ.. క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. అజింక్య రహానే (8) ఔట్ అవ్వడంతో టీ విరామ సమయానికి భారత్ 182/4తో నిలిచింది.

4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను విరాట్‌ కోహ్లీ ఆదుకున్నాడు. ఆర్ జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు. కోహ్లీ నిలకడగా బౌండరీలు భారత్ స్కోరును మ్ముందుకు నడిపాడు. ఈ క్రమంలో 67 ఓవర్‌లో ఫోర్ బాది టెస్టుల్లో కోహ్లీ 30వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. రెండో రోజు కోహ్లీ సెంచరీ చేసే అవకాశం ఉంది. ఇక శుభ్‌మన్‌ గిల్ (10), అజింక్య రహానే (8) తొలి టెస్టులో మాదిరిగానే తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు.

Also Read: Lakshmi stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ పంట పండినట్లే..!