West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి రోజు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలం చూపిస్తే.. ఆరంగేట్ర ఆటగాడు జైస్వాల్ ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 10 ఓవర్లకు 29/0తో నిలిచింది. నిలకడగా ఆడుతున్న త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12)ను ఆర్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో విండీస్ వికెట్ల పతనం మొదలైంది. బ్రాత్‌వైట్ (20)ను అశ్విన్.. రీఫర్ (2)ను శార్దూల్ ఠాకూర్.. బ్లాక్‌వుడ్ (14)ను జడేజా ఔట్ చేశారు. తొలి సెషన్‌లో 68/4తో నిలిచిన విండీస్.. రెండో సెషన్‌లోనూ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది.
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
జోష్వా ద సిల్వా (2)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో అథనేజ్ (47), జేసన్ హోల్డర్ (18) నిలకడగా ఆడటంతో వెస్టిండీస్ స్కోరు 100 దాటింది. అయితే ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపటికే అల్జారి జోసెఫ్ (4)తో పాటు అథనేజ్‌లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి విండీస్ 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్‌లో కీమర్ రోచ్ (1) జడేజా బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. వారికన్ (0)ను అశ్విన్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌటైంది.
వెస్టిండీస్ ఆలౌట్ అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్ మొదలెట్టింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యశస్వి.. అదే ఫామ్ కంటిన్యూ చేశాడు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ రోహిత్ శర్మకు అండగా నిలబడ్డాడు. ఈ ఇద్దరు 23 ఓవర్లు ఆడి 80 పరుగులు చేశారు. నేడు కూడా భారత పెనర్లు చెలరేగితే.. విండీస్ ముందు భారీ స్కోర్ ఉంచే అవకాశం ఉంటుంది.
Also Read: Militaries: ప్రపంచవ్యాప్తంగా పవర్‌ఫుల్ మిలిటరీస్ కలిగిన టాప్-10 దేశాలు