Site icon NTV Telugu

IND vs UAE: చెలరేగిన కుల్దీప్‌, దూబే.. 57 పరుగులకే యూఏఈ ఆలౌట్‌!

Kuldeep Yadav 4 Wickets

Kuldeep Yadav 4 Wickets

ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 13.1 ఓవర్లలో 57 పరుగులకే యూఏఈ కుప్పకూలింది. ఓపెనర్లు అలిషామ్ స్కార్ఫ్ (22), ముహమ్మద్ వసీమ్‌ (19) టాప్‌ స్కోరర్లు. మిగతా యూఏఈ బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 3 కంటే ఎక్కువ పరుగులు ఎవరూ చేయకపోవడం విశేషం. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్ 4, శివమ్ దూబే 3 వికెట్స్ పడగొట్టారు.

Also Read: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈకి ఆదిలోనే షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న అలిషామ్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ వెంటనే ముహమ్మద్ జోహైబ్ (2), రాహుల్ చోప్రా (3)లను వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చారు. వసీమ్‌ను కుల్దీప్ బుట్టలో వేశాడు. ఆపై శువం దూబే విరుచుకుపడ్డాడు. భారత బౌలర్ల దెబ్బకు యూఏఈ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కుల్దీప్‌ 4, శివమ్‌ 3 వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్‌, వరుణ్ తలో ఒక్కో వికెట్‌ పడగొట్టారు. భారత్ లక్ష్యం 58 పరుగులు.

Exit mobile version