NTV Telugu Site icon

IND vs SL: తక్కువ పరుగులకే టీమిండియా పరిమితం.. శ్రీలంక టార్గెట్ 138..

Ind Vs Sl (1)

Ind Vs Sl (1)

IND vs SL 3rd T20: నేడు టీమిండియా శ్రీలంకతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లు టీమిండియా బ్యాటర్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 పరుగులకే కీలక ఐదు వికెట్లను చేజారి పీకలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన జైశ్వల్ కేవలం పది పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి సారీ అంటూ డకౌట్ గా వెను తిరిగాడు. ఇక వరుస ఓవర్లలో టీమిండియా బ్యాట్స్మెన్ ను పెవీలియన్ బాట పట్టారు. ఈ స్థితిలో ఓపెనర్ గా వచ్చిన శుభమన్ గిల్ 37 బంతులను ఎదుర్కొని మూడు పూటలతో 39 పరుగులు సాధించాడు. ఇక చివర్లో రియాన్ పరాగ్ 26 పరుగులు, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో టీమ్ ఇండియాకు గౌరవమైన స్కోరును అందించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.

AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..

మరోవైపు శ్రీలంక బౌలర్ల విషయానికి వస్తే.. మహేష్ దీక్షణ మూడు వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లతో సత్తా చాటారు. చెమిందో, ఫెర్మాండో, రమేష్ మెండిస్ లు చెరో వికెట్ తీయడంతో టీమిండియా తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో విజయం సాధించారు. శ్రీలంక విజయం సాధించాలంటే 138 పరుగులను జోడించాలి.

Delhi coaching centres: విద్యార్థుల మృతి తర్వాత యాక్షన్.. లైబ్రరీలు మూసివేత