Suryakumar Yadav: గంటలతరబడి వాడీవేడిగా చర్చ.. సూర్యకే ఓటేసిన ప్లేయర్స్!
- IND vs SL
- Suryakumar Yadav
- Hardik Pandya
- Suryakumar Yadav Captain
- Suryakumar Yadav BCCI
- India T20 Captaincy
- Hardik vs Suryakumar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Takes India Players openios on T20 Captaincy: రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ స్థానంలో టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ చాలా కసరత్తులు చేసిందట. రెండు రోజుల పాటు గంటలతరబడి సుదీర్ఘ చర్చలు అనంతరం నిర్ణయం తీసుకున్నారట. ప్లేయర్స్ అభిప్రాయం కూడా తీసుకున్నారట.
భారత్ మరో వారం రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జట్ల ఎంపిక కోసం బీసీసీఐ సుదీర్ఘంగా చర్చలు జరిపిందట. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ విషయంలో. ప్లేయర్లలో ఎక్కువ మంది సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపారని వార్తలు వస్తున్నాయి. ‘శ్రీలంక పర్యటన కోసం జట్లను ప్రకటించేందుకు బీసీసీఐ తీవ్ర కసరత్తులు చేసింది. ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకుంది. ఎక్కువమంది హార్దిక్ పాండ్యా కంటే సూర్య సారథ్యంలో ఆడేందుకు ఆసక్తి చూపారు. రెండు రోజుల పాటు గంటలతరబడి సెలక్షన్ కమిటీ చర్చించింది. వాడీవేడిగా చర్చ జరిగింది. కొన్ని విషయాలపై విభిన్న అభిప్రాయాలూ వెలుబడ్డాయి. మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపింది’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
- Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
Also Read: 90’s – A Middle Class Biopic: 90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు సీజన్ 2, 3!
‘గాయాలు కూడా హార్దిక్ పాండ్యా నియామకంపై ప్రభావం చూపాయి. సూర్య సహచరులతో నడుచుకునే తీరు బీసీసీఐ సెలక్టర్లను ఆకర్షించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య సారథిగా ఉండగా.. ఇషాన్ కిషన్ టోర్నీ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు. అతడిని ఆపేందుకు సూర్య చాలా ప్రయత్నాలు చేశాడు. ప్లేయర్లతో మాట్లాడే విషయంలో హార్దిక్ కంటే సూర్య చాలా బెటర్. రోహిత్ శర్మ మాదిరే అతడు ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తాడు. ఇవన్నీ పరిగలోకి తీసుకున్న మేనేజ్‌మెంట్ సూర్యనే ఎంపిక చేసింది’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!