NTV Telugu Site icon

Suryakumar Yadav: గంటలతరబడి వాడీవేడిగా చర్చ.. సూర్యకే ఓటేసిన ప్లేయర్స్!

Suryakumar Yadav, Hardik Pandya

Suryakumar Yadav, Hardik Pandya

BCCI Takes India Players openios on T20 Captaincy: రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో వైస్‌ కెప్టెన్ అయిన హార్దిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ స్థానంలో టీ20 సారథిగా సూర్యకుమార్‌ యాదవ్ ఎంపికయ్యాడు. దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ చాలా కసరత్తులు చేసిందట. రెండు రోజుల పాటు గంటలతరబడి సుదీర్ఘ చర్చలు అనంతరం నిర్ణయం తీసుకున్నారట. ప్లేయర్స్ అభిప్రాయం కూడా తీసుకున్నారట.

భారత్ మరో వారం రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. జట్ల ఎంపిక కోసం బీసీసీఐ సుదీర్ఘంగా చర్చలు జరిపిందట. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ విషయంలో. ప్లేయర్లలో ఎక్కువ మంది సూర్యకుమార్‌ యాదవ్ వైపే మొగ్గు చూపారని వార్తలు వస్తున్నాయి. ‘శ్రీలంక పర్యటన కోసం జట్లను ప్రకటించేందుకు బీసీసీఐ తీవ్ర కసరత్తులు చేసింది. ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకుంది. ఎక్కువమంది హార్దిక్ పాండ్యా కంటే సూర్య సారథ్యంలో ఆడేందుకు ఆసక్తి చూపారు. రెండు రోజుల పాటు గంటలతరబడి సెలక్షన్ కమిటీ చర్చించింది. వాడీవేడిగా చర్చ జరిగింది. కొన్ని విషయాలపై విభిన్న అభిప్రాయాలూ వెలుబడ్డాయి. మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపింది’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Also Read: 90’s – A Middle Class Biopic: 90s-ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌కు సీజన్ 2, 3!

‘గాయాలు కూడా హార్దిక్ పాండ్యా నియామకంపై ప్రభావం చూపాయి. సూర్య సహచరులతో నడుచుకునే తీరు బీసీసీఐ సెలక్టర్లను ఆకర్షించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య సారథిగా ఉండగా.. ఇషాన్ కిషన్ టోర్నీ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు. అతడిని ఆపేందుకు సూర్య చాలా ప్రయత్నాలు చేశాడు. ప్లేయర్లతో మాట్లాడే విషయంలో హార్దిక్ కంటే సూర్య చాలా బెటర్‌. రోహిత్‌ శర్మ మాదిరే అతడు ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తాడు. ఇవన్నీ పరిగలోకి తీసుకున్న మేనేజ్‌మెంట్ సూర్యనే ఎంపిక చేసింది’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.