India Squad For T20I Series Against Sri Lanka: ఇటీవలే జింబాంబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు.. శ్రీలంక పర్యటనకు సిద్దమైంది. శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కెప్టెన్ ఎవరు?, జట్టులోకి ఎవరు వస్తారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. వీటన్నింటికి నేడు సమాధానం దొరకనుంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ నేడు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పాండ్యాకు ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా వర్క్‌లోడ్ మేనేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని గౌతీ భావిస్తున్నాడట. ఇక టీ20లకు ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మకు చోటు దక్కనుంది.
ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు చోటు ఖాయం. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎంపికవుతాడు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే.. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండనున్నారు. జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకుంటే.. అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. మూడో పేసర్‌గా ఆవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ కుల్దీప్ రెస్ట్ తీసుకుంటే.. రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కుతుంది.
Also Read: Naveen Polishetty Injury: హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు.. చాలా కష్టంగా ఉందంటూ..!
భారత టీ20 జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్.