Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాల్గో రోజు ఆటలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక సీనియర్ బ్యాటర్, 36 ఏళ్ల దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నాలుగో రోజు తొలి సెషన్లో బావుండ్రీ వద్ద బంతిని నిరోధించే క్రమంలో డైవ్ చేయడంతో ఆయన కుడి భుజం, మెడ భాగంలో బలమైన దెబ్బ తగిలింది. గ్రౌండ్లోకి వచ్చిన శ్రీలంక జట్టు ఫిజియో, వైద్యులు ప్రాథమికంగా పరిశీలించినప్పటికీ నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం ముందస్తు జాగ్రత్త చర్యగా చండీమాల్ను స్కానింగ్ నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ (SLC) ప్రకటన విడుదల చేసింది. వైద్య నివేదికలు వచ్చాకే ఆయన గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. 93 టెస్టుల్లో 16 శాతకాలతో 6,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన చండీమాల్‌కు ఈ మ్యాచ్‌లో పెద్దగా కలిసి రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయన కేవలం 4 పరుగులకే నిరాశపరిచారు.
మరోవైపు నాల్గో రోజు లంచ్ సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా నిరాశపరచగా, కెఎల్ రాహుల్ (35), తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు దేవదత్ పడిక్కల్ (44) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8) పరుగులు మాత్రమే చేసి మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం భారత్ మొత్తంగా 294 పరుగుల సురక్షితమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు భారత్ చేసిన 462 పరుగుల భారీ స్కోరుకు సమాధానంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. లంక జట్టులో సోనాల్ దినుషా (110) శతకం చేయగా, నిరోషన్ డిక్వెల్లా (80) రన్స్ చేశారు. భారత బౌలర్లు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లోనే 178 పరుగుల కొండంత ఆధిక్యం దక్కింది.
Also Read
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
తాజావార్తలు
-
Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
-
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!